టీమిండియా క్రికెటర్ రిషభ్‌పంత్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ట్విటర్ వేదికగా ఆదివారం ప్రకటించారు. యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపునకు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. స్వయంగా వీడియోకాల్ చేసి పంత్‌కు తమ నిర్ణయాన్ని సీఎం చెప్పారు. ఈ క్రమంలో పంత్ స్పందించాడు. ప్రజలకు క్రీడలు, ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని సీఎంతో అన్నాడు. ప్రభుత్వం తనకిచ్చిన అవకాశం పట్ల సీఎంకు అతను ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు పంత్ ట్వీట్‌చేశాడు.
ఇదీ చదవండి: రికీ పాంటింగ్ కూతురి బర్త్‌డే.. పంత్ కామెంట్స్! రిప్లే కూడా ఇవ్వని పాంటింగ్