స్టార్ క్రికెటర్లకు మంచి స్టార్ క్రికెటర్ల భార్యలకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటోంది. అందకు ప్రత్యక్ష ఉదాహరణ చాహల్ భార్య.. ధనశ్రీనే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ డాన్సులతో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. ఇలానే అభిమానులను ఆకర్షించడం కోసం ఓ స్టార్ క్రికెటర్ భార్య పెట్టిన నెట్టింట ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలు ఫోటోలు పంచుకోవడమన్నది ఈ రోజుల్లో కామన్. అభిమానులను నేరుగా కలవడం ఎప్పటికప్పుడు సాధ్యమవ్వదు కనుక.. వారికి సంబంధించిన ఫోటోలు/వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇలానే ఓ స్టార్ క్రికెటర్ భార్య.. తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్స్ వాటిని ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అందుకు కారణం.. ఆమె బికినీలో దర్శనమివ్వటమే. ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా..? రాబిన్ ఊతప్ప.
స్టార్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప భార్య శీతల్ గౌతమ్ గురించి స్పోర్ట్స్ లవర్స్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. తాను మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. శీతల్ ఉతప్పకు సోషల్ మీడియా పరంగా మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆమె ఫాలోయింగ్‌కి కారణం ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలే. హాట్ హాట్‌గా కనిపించే శీతల్.. సోషల్ మీడియాలో సెగలు రేపే ఫోస్టులు ఎన్నో పెట్టింది. అందులో ఈ బికినీ ధరించినది ఒకటి. ఆమె ఫోటోలు చూస్తే బాలీవుడ్ హీరోయిన్లు కూడా శీతల్ సెగల ముందు తక్కువే అనిపించడం గ్యారెంటీ. కాకుంటే ఇద్దరి పిల్లల తల్లైన శీతల్ ప్రొఫైల్ లో ఈ ఫోటోలు కనిపించడమే ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
2016లో శీతల్ గౌతమ్‌ను ప్రేమించి పెళ్లాడాడు రాబిన్ ఉతప్ప. క్రిస్టియన్ మతానికి చెందిన శీతల్, రాబిన్ ఊతప్పను పెళ్లాడిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించింది. భారత జట్టుకు దూరమై ఊతప్ప డిప్రెషన్‌కి గురైన సమయంలో అతనికి వెన్నంట అండగా నిలిచి, ధైర్యం చెప్పింది శీతల్. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు.. నీల్ నోలన్ ఊతప్ప కాగా, కూతురు పేరు.. ట్రినిటి థియా ఊతప్ప. శీతల్ సోమహల్ మీడియా ఫోటోలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.