భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మాదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. సెంచరీ తర్వాత ఖవాజా భావోద్వేగానికి గురయ్యాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మాదాబాద్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా చెప్పుకోవచ్చు. తొలి మూడు టెస్టుల్లో స్పిన్ పిచ్‌లను కోరిన టీమిండియా.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో నాలుగో టెస్టుకు కాస్త బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ను తయారుచేయించనట్టు కనిపిస్తోంది. అందుకే ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తాతాల్కిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించి మంచి ఫలితం సాధిస్తున్నాడు. 255 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండు రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 106 ఓవర్లు ముగిసే సరికి మరో వికెట్ కోల్పోకుండా.. 295 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తొలి రోజే సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభంలోనే పిచ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్న ఖవాజా పిచ్‌కు తగ్గట్టు బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఖవాజాకు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ కాగా.. భారత్‌లో మాత్రం ఇదే తొలి సెంచరీ. అయితే.. గతంలో రెండు సార్లు భారత పర్యటనకు వచ్చినప్పుడు తుది జట్టులో చోట దక్కని ఖవాజా.. మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లకు డ్రింక్స్ మోశాడు. ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియా నుంచి ఈ సిరీస్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఖవాజా నిలిచాడు. ఈ విషయం గురించి ఖవాజా మాట్లాడుతూ..‘గతంలో రెండు సార్లు భారత్‌కు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను. కానీ.. ఇప్పుడు సెంచరీ చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ఇది నిజంగా నాకు చాలా స్పెషల్’ అని ఖవాజా తెలిపాడు.
అయితే.. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. చివరి టెస్టు డ్రాగా ముగిసినా.. భారత్ గెలిచినా సిరీస్ భారత్ వశమవుతుంది. ఒక వేళ ఆస్ట్రేలియా గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. అలా అయినా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ వద్దే ట్రోఫీ ఉంటుంది. అయితే.. చివరి టెస్టులో గెలిస్తే భారత్ నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుతుంది. మ్యాచ్ ఓడినా, డ్రా అయినా శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్ ఎటాక్ ముందు తేలిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s an 14th Test century for Usman Khawaja – his first against India! That adds to…
3️⃣ v Pakistan
3️⃣ v England
3️⃣ v New Zealand
2️⃣ v South Africa
1️⃣ v Sri Lanka
1️⃣ v West Indies#INDvAUS pic.twitter.com/C4kENE7cyJ— 7Cricket (@7Cricket) March 9, 2023