భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో అదరగొట్టాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో పాతుకుపోయాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు అహ్మాదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు అద్భుతంగా ఆడి.. పటిష్టస్థితిలో నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. 251 బంతుల్లో 15 ఫోర్లతో 104 పరుగులు చేసి.. ఆసీస్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఉస్మాన్ ఖవాజా.. మంచి స్టార్ట్‌ను అందించాడు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత.. హెడ్ 44 బంతుల్లో 7 ఫోర్లతో 32 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకుముందే హెడ్ అవుట్ అవ్వాల్సి ఉన్నా.. భారత వికెట్ కీపర్ కేఎస్ భరత్ సునాయసమైన క్యాచ్‌ను జారవిడువడంతో బతికిపోయాడు. కానీ.. కొంతసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మార్నస్ లబుషేన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 3 రన్స్ మాత్రమే చేసి లబుషేన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఉస్మాన్‌తో జతకలిసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను 150 పరుగుల మార్క్ దాటించాడు. కానీ.. జడేజా బౌలింగ్‌లో చాలా సింపుల్‌గా స్మిత్ అవుట్ అయ్యాడు. 135 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన స్మిత్.. ఈ సిరీస్‌లో ముచ్చటగా మూడో సారి జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్మిత్ అవుటైన కొద్ది సేపటికే అద్భుతమైన డెలవరీతో పీటర్ హ్యాండ్స్‌కాంబ్(17) షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ స్పీడ్‌కు హ్యాండ్స్‌కాంబ్ వికెట్ గాల్లో పల్టీలుకొట్టింది.
ఇలా ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. చాలా మొండిగా నిలబడ్డ ఖవాజా.. సెంచరీతో సత్తా చాడాడు. తొలి రోజు 90 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104, కామెరున్ గ్రీన్ 49 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్‌కు వికెట్ దక్కలేదు. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో భారత్ ఘన విజయం సాధించగా.. ఇండోర్‌లో ఇటివల ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఆ విజయంతోనే ఆసీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే.. భారత్ సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లనుంది. మరి నాలుగో టెస్టు తొలి రోజు ఉస్మాన్ ఖవాజా సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hundred for Usman Khawaja, the best Australian batsman in BGT 2023, has been terrific in Asia.
He is the first Australian to score a hundred in this BGT. pic.twitter.com/QT0EKPzaOx
— Johns. (@CricCrazyJohns) March 9, 2023