ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ వినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్లు భారీ ధరపెట్టి కొనుగోలు చేయగా.. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. అలాగే ఆసీస్ యువ క్రికెటర్ కామెరున్ గ్రీన్‌కు రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అలాగే విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అసలు ఊహించని ధర దక్కింది. రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ దక్కించుకుంది. మరి ఇలా కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. చాలా మందిని మాత్రం పట్టించుకోలేదు. ఐపీఎల్‌కు ఈ ప్లేయర్లు అవసరం లేదంటూ.. పక్కన పెట్టింది.
ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడు పోవారిలో కుసల్ మెండీస్, టామ్ బాంటన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, తబ్రాజ్ షమ్సీ, ముజీబ్ రెహ్మాన్, రాస్సీ వాన్ డెర్ డసన్, డేవిడ్ మలాన్, డారిల్ మిచెల్, నబీ లాంటి స్టార్లు కూడా ఉన్నారు. వీరితో పాటు అనేక మంది భారత యువ క్రికెటర్లును సైతం ప్రాంచైజ్‌లు పట్టించుకోలేదు. గతంలో భారీ ధర పలికిన జిమ్మి నీషమ్ కూడా ఈ మినీ వేలంలో అమ్ముడు పోలేదు. ఈ స్టార్ క్రికెటర్లతో పాటు ఐపీఎల్ ఆడే అవకాశం దక్కని ప్రముఖ్య క్రికెటర్లు.. ప్రియామ్ గార్గ్, పాల్ స్టిర్లింగ్, షెర్ఫీన్ రూథర్‌ఫోర్డ్, ట్రావిస్ హెడ్, దాసున్ షనకా, టస్కిన్ అహ్మద్, బ్లెస్సింగ్ ముజరబానీ, బాబా ఇంద్రజిత్, జమీ ఓవర్టన్, రిచర్డ్ గ్లీసన్, దిల్షన్ మదుశంకా, వరుణ్ ఆరోన్ వీరింద్దరికీ మంచి రికార్డులు ఉన్నా.. ఫ్రాంచైజ్‌లు వారివారి రిక్వైర్‌మెంట్ మేరకు ఆటగాళ్లను పిక్ చేసుకున్నాయి.
అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంటే.. అసలు అమ్ముడుపోరు అని ఊహించిన కొంతమంది ఆటగాళ్లు లక్కీ ఛాన్స్‌లు కొట్టేశారు. వారిలో ముఖ్యంగా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఉన్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన ఈ ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయదని అంతా భావించారు. అనుకున్నట్లే.. తొలి రౌండ్‌లో రూట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ రెండో రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది. అలాగే.. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌కు సైతం ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రక్ట్ దక్కడం కష్టమే అనుకున్నారు. అతన్ని కూడా రెండో రౌండ్‌లో మాజీ ఫ్రాంచైజ్ కేకేఆర్ బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. మరి అనూహ్యంగా అమ్ముడుపోయిన, అమ్ముడుపోని ఆటగాళ్ల లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝘿𝙤𝙣𝙚 & 𝘿𝙪𝙨𝙩𝙚𝙙!
Here are the 🔟 squads that will be ready to face each other and set the stage on 🔥🔥 in the #TATAIPL 2023#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/e1qHauwa7G
— IndianPremierLeague (@IPL) December 24, 2022