సాధారణంగా క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ. దిగ్గజ ఆటగాళ్లు రికార్డులను సృష్టించడం.. ఆ రికార్డులను మరో దిగ్గజ ఆటగాడు బద్దలు కొట్టడం క్రికెట్ లో సర్వసాధారణమే. అయితే క్రికెట్ లో కొన్ని రికార్డులు మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరని అనుకుంటారు. అలాంటి రికార్డును నేను బ్రేక్ చేస్తా అంటున్నాడు టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్. పాకిస్థాన్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ రికార్డును శ్రీలంకతో జరిగే సిరీస్ లో బద్దలు కొడతానని ధీమా వ్యక్తం చేశాడు మాలిక్. అయితే ముందు వ్యక్తిగత రికార్డుల కంటే నాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్ ఎవరు అంటే వెంటనే అక్తర్ అని చెబుతారు.. క్రికెట్ గురించి తెలిసిన సగటు అభిమానులు ఎవరైనా. అయితే అతడి రికార్డును బద్దలు కొడతా అంటున్నాడు టీమిండియా నయా బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు ఎంపికైయ్యాడు ఉమ్రాన్ మాలిక్. మంగళవారం(జనవరి 3)న తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో.. ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడాడు మాలిక్. ఈ క్రమంలో అక్తర్ విసిరిన వేగవంతమైన బంతి రికార్డును బద్దలు కొడతారా? అన్న ప్రశ్న మాలిక్ కు ఎదురైంది. ఈ ప్రశ్నపై మాలిక్ స్పందిస్తూ..”ప్రస్తుతం నేను ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే.. అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టడం ఏమంత పెద్ద విషయం కాదు. అదృష్టవశాత్తు అంతా మంచిగా జరిగితే.. అక్తర్ రికార్డు గ్యారంటీగా బద్దలు కొడతా. అదే నా లక్ష్యం.. అయితే నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం జట్టు ప్రయోజనాలే, దేశం కోసం ఆడటమే. ఇకపోతే మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌలర్ ఎంత వేగంగా బంతివిసిరాడు అన్న సంగతి తెలీదు” అని మాలిక్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఈ విషయాలు మాకు తెలుస్తాయని ఉమ్రాన్ పేర్కొన్నాడు. ఇక నేను బంతిని వేగంగా విసరడ కంటే లైన్ అండ్ లెన్త్ లో పడుతుందా.. లేదా అనే చూస్తానని ఉమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఇక అక్తర్ రికార్డు విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓ బాల్ ను గంటకు 161.3 కి.మీ వేగంతో విసిరాడు. ఇదే ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బాల్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఉమ్రాన్ కంటిన్యూస్ గా 150 కి.మీ వేగంతో బంతులు విసురుతు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఉమ్రాన్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే అక్తర్ రికార్డ్ బద్దలు కావడానికి మరిన్ని రోజులు కూడా పట్టవు అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గతంలోనే అక్తర్.. తన రికార్డును బ్రేక్ చేసే సత్తా ఉన్న బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడం విశేషం.
Shoaib Akhtar wants young speed sensation Umran Malik to break his record 🤯
Can he break the streak! #umranmalik #shoaibakhtar #srh #umran #malik #shoaib #akhtar #IPL #IPL2022 #fastbowling #cricketchannel #cricketvideos #cricket pic.twitter.com/Sb27ZhDYMb
— Sportskeeda (@Sportskeeda) May 15, 2022