టీమిండియా అంటే బ్యాటర్లు, స్పిన్నర్లు మాత్రమే చాలామందికి గుర్తొస్తారు. పేస్ బౌలర్లు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది. బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్ళు తమ స్పీడ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. బుల్లెట్ల లాంటి బంతులేసి బ్యాటర్లని భయపెడుతున్నారు. అయితే బుమ్రా గతేడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడనేది ఇంకా తెలియట్లేదు. ఈ టైంలో సిరాజ్, ఉమ్రాన్ లాంటి వాళ్లు మెప్పిస్తున్నారు. వీరితో పాటు యువ బౌలర్లు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు.
ఇక విషయానికొస్తే.. టీ20ల్లో ఉమ్రాన్ మాలిక్ టాప్ ఫెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటుంటే.. వన్డేల్లో ఆ ప్లేసుని సిరాజ్ భర్తీ చేస్తున్నాడు. బుమ్రా లేని లోటుని వీళ్లిద్దరూ అస్సలు తెలియనివ్వట్లేదు. అంత బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా గతేడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి వచ్చిన స్పీడ్ గన్ ఉమ్రాన్.. ఆడిన కొద్ది మ్యాచుల్లోనే అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీ20ల్లో 155 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసి బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన ఇతడు.. లంకతో వన్డే సిరీస్ లో 157 కిమీపైగా వేగంతో బంతులేస్తున్నాడు. ఇలా టీమిండియా తరఫున వన్డే, టీ20ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డ్స్ సెట్ చేసిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలో ఓవరాల్ క్రికెట్ లోనే ఫాస్టెస్ట్ బాల్ రికార్డుని బ్రేక్ చేయబోతున్నాడని మన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ జోస్యం చెబుతున్నాడు.
‘ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు దొరికిన వజ్రాం లాంటోడు. 150 కిమీ లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ ఉంటే ఏ టీమ్ కు అయినా ప్లస్ పాయింటే. అతడి టాలెంట్ టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అతడు స్టార్ బౌలర్ అవుతాడు. ఉమ్రాన్.. లాంగ్ కెరీర్ కంటిన్యూ చేయాలంటే ఫిట్ నెస్ కాపాడుకోవడం చాలా అవసరం. నా ఉద్దేశంలో త్వరలోనే ఉమ్రాన్.. షోయబ్ అక్తర్ రికార్డుని బ్రేక్ చేస్తాడు. 125 స్పీడుతో బౌలింగ్ చేసేవాడు 150 వేయాలంటే కష్టం. 150 స్పీడ్ వేసేవాడు.. 155 వేయగలడు. 155 వేసేవాడు ఈజీగా 160 అందుకోగలడు. కాబట్టి అక్తర్ 161 Kmph రికార్డుని ఉమ్రాన్ అధిగమిస్తాడనే నమ్మకం నాకు ఉంది’ అని కోచ్ భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
Umran Malik is here just for this! #INDvSL pic.twitter.com/6MpIcYCeBG
— Wisden India (@WisdenIndia) January 10, 2023