టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్.. ఒక విషయంలో మాత్రం యువరాజ్‌సింగ్‌ను దాటేశాడు. అది కూడా బ్యాటింగ్‌లోనే.. వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం.
టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఎలాంటి బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువీని మించిన ఆల్‌రౌండర్ ఇండియాలో లేడంటే అతిశయోక్తికాదు. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించడమే కాకుండా.. ఆ వరల్డ్ కప్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ అద్భుత ఆల్‌రౌండర్‌తో టీమిండియాకు వరల్డ్ కప్ అందించి.. తాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.
అలాంటి ఆటగాడి రికార్డును తాజాగా ఒక బౌలర్ బద్దలు కొట్టాడు. అది కూడా బ్యాటింగ్ విభాగం. టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్.. టెస్టు క్రికెట్‌లో యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. సిక్సర్ల కింగ్‌గా పేరు తెచ్చుకున్న యువీ.. తన కెరీర్‌లో మొత్తం 40 టెస్టులు ఆడి.. 22 సిక్సులు బాదాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఉమేష్ యాదవ్ 2 భారీ సిక్సులు కొట్టడంతో.. టెస్టుల్లో తన సిక్సర్ల సంఖ్య 24కు పెంచుకుని, యువీని దాటేశాడు. యువీ లాంటి ప్లేయర్‌ను బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ దాటేయడం, అది కూడా సిక్సర్ల విషయంలో కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ విషయంపై ఆసిక్తి చూపిస్తున్నారు.
యువీ సిక్సులను దాటిన ఉమేష్ యాదవ్.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సిక్సుర్లను సైతం సమం చేయడం విశేషం. టెస్టుల్లో కోహ్లీకి 24 సిక్సులు ఉన్నాయి. అలాగే ఉమేష్‌కు కూడా 24 సిక్సుర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చే ఉమేష్.. భారీ సిక్సర్లతో సందడి చేస్తాడనే విషయం తెలిసిందే. అతను అలా చేసే కొన్ని పరుగులైనా.. కొన్నిసార్లు టీమ్‌కు ఎంతో కీలకంగా మారుతాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 95 పరుగులతో ఆడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఉమేష్ సిక్సులతో పాటు, యువీని దాటేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Umesh Yadav surpasses Yuvraj Singh and equals Virat Kohli in hitting the most sixes in Test cricket.#BorderGavaskarTrophy2023 #BGT2023 #news #cricketnews #CricketTwitter #Cricket #sports #NewsUpdates #sportsnews #ViratKohli𓃵 #IndvsAus #INDvAUS #IndvsAus @y_umesh @YUVSTRONG12 pic.twitter.com/QHVyaQkwRB
— CricInformer (@CricInformer) March 1, 2023