తిలక్ వర్మ ఫ్యూచర్ స్టార్ గా కనిపిస్తున్నాడు. అచ్చం యువరాజ్ లా బ్యాటింగ్ చేస్తున్న తిలక్ రెండో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. అతని వెరైటీ సెలబ్రేషన్స్ వెనుక ఓ పెద్ద కారణమే ఉంది.
తిలక్ వర్మ.. ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. ఇప్పటికే కొన్ని సీజన్స్ తో పాటు ఐపీఎల్ లో సత్తా చాటిన ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు టీమిండియాలో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు సెలెక్ట్ అయిన తిలక్.. తొలి రెండు వన్డేల్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించి.. ఫ్యూచర్ లో తాను ఎంత విలువైన ఆటగాడో చెప్పకనే చెప్పాడు. అయితే.. కెరీర్ తొలి హాఫ్ సెంచరీ చేశాక.. తిలక్ వర్మ చేసుకున్న సెలబ్రేషన్ అందరికీ కాస్త విచిత్రంగా అనిపించింది. చిన్నగా పరిగెడుతున్నట్టు ఓ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు తిలక్.
అయితే.. ఈ సెలబ్రేషన్ కి కారణం.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా అట.తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ టీమ్ లో చాలా కీలకమైన ఆటగాడు. రోహిత్ శర్మ అండతోనే తిలక్ కు అక్కడ మంచి అవకాశాలు వచ్చాయి. ఈ కారణంగానే.. తిలక్ కు రోహిత్ అన్నా, అతని ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం, గౌరవం. ఇక రోహిత్ గారాల పట్టి సమైరా అయితే.. తిలక్ వర్మ ఫేవరేట్ కిడ్. సమైరాతో ఆడుకుంటూ తిలక్ ఎన్నో వీడియోస్ లో కనిపించాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ల సమయంలో సమైరానే తిలక్ స్ట్రెస్ బస్టర్ అట. ఇంత బాండింగ్ తో ఉంది కాబట్టే.. నా తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీ నీతో సెలబ్రేట్ చేసుకుంటా అని తిలక్.. సమైరాకి మాట ఇచ్చాడట.
ఆ మాట ప్రకారమే.. తిలక్ ఓ క్యూట్ అండ్ కూల్ సెలబ్రేషన్ చేసుకుని, తన తొలి హాఫ్ సెంచరీని సమైరాకి అంకితం ఇచ్చాడట.ఇక కుర్రాళ్లతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకి ఏమి కలిసి రావడం లేదు. రెండు టీ20ల్లో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేసినా జట్టు మాత్రం ఓడిపోయింది. మరోవైపు కోచ్ ద్రవిడ్ గా నిర్ణయాలు, కెప్టెన్ గా హార్దిక్ వ్యూహాలు ఏవీ పని చేయడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కుర్రాళ్ళ కోసం కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలను పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో టీమిండియాకి మిగిలిన మూడు టీ20 మ్యాచ్ లు గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. మరి.. కుర్రాళ్ళు ఈ కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Tilak Varma dedicated his maiden T20I half-century to Rohit Sharma’s daughter Samaira! 🤗#WIvIND #TilakVarma #RohitSharma pic.twitter.com/CzcPaGMBog
— OneCricket (@OneCricketApp) August 7, 2023