యాషెస్ సిరీస్‌కు గొప్ప ఆరంభం లభించింది. ఫస్ట్ టెస్టులో నరాలు తెగే ఉత్కంఠలో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీకి కమ్బాల్తో కంగారూ టీమ్ చెక్ పెట్టింది.
టెస్ట్ క్రికెట్లో ఉండే అసలైన మజా ఏంటో తెలియాలంటే యాషెస్ సిరీస్ చూడాల్సిందేనని క్రికెట్ ప్రేమికులు అంటుంటారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్స్ మధ్య జరిగే ఈ సిరీస్ దాదాపుగా ఒక యుద్ధాన్నే తలపిస్తుంది. ఈ రెండు జట్లు యాషెస్ ఆడుతున్నాయంటే స్టేడియంలో, టీవీల ముందు ఆ మ్యాచ్‌లకు అతుక్కుపోవాల్సిందే. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఏమాత్రం బోర్ కొట్టకుండా, ప్రతి సెషన్ ఉత్కంఠగా సాగుతూ మ్యాచ్ ఆఖరి రోజు ఫినిష్ అవడం యాషెస్‌లో ఎక్కువగా చూస్తుంటాం. చివరి రోజు చివరి సెషన్లో కొద్ది తేడాతో ఏదో ఒక టీమ్‌ను విజయం వరించడం ఈ సిరీస్‌లో ఈమధ్య పరిపాటిగా మారింది. ఈ ఏడాది యాషెస్ ఫస్ట్ టెస్టులోనూ ఇదే జరిగింది. తొలి టెస్టులో అందరూ ఊహించిన దాని కంటే అనూహ్యమైన ఫలితం వచ్చింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమ్ గొప్పగా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
హైటెన్షన్ ఫైట్‌లో కంగారూ జట్టు 2 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించింది. 281 రన్స్ ఛేజింగ్‌లో ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ కొట్టిన ఓపెనర్ ఖవాజా (197 బాల్స్‌లో 65).. మరోమారు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చేజారుతున్న టైమ్‌లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44 నాటౌట్).. స్పిన్నర్ నాథన్ లయన్‌తో కలసి గొప్పగా పోరాడి టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. బజ్‌బాల్ స్ట్రాటజీతో వణుకు పుట్టిస్తున్న ఇంగ్లండ్‌ను.. కమిన్స్ తన కమ్బాల్తో చెక్ పెట్టాడని మెచ్చుకుంటున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్ అంటే ఎలా ఉంటుందో కంగారూ టీమ్ చూపించిందని.. ఈ ఫార్మాట్‌ను ఎలా ఆడాలో కమిన్స్ ప్రూవ్ చేశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓపిక, తెగువ చూపించడమే లాంగ్ ఫార్మాట్లో కీలకమని కమిన్స్ నిరూపించాడని.. దీనికే కమ్‌బాల్ అంటూ నెటిజన్స్ నామకరణం చేశారు. కమ్‌బాల్ ముందు బజ్‌బాల్ ప్లాన్ తేలిపోయిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
The winning moment for Australia.
Captain Pat Cummins the hero! pic.twitter.com/912q2z3kP7
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 20, 2023
Cumball. Bazball pic.twitter.com/Qp932kZJBv
— Diptrick Cummins (@awkdipti) June 20, 2023
Bazball just lost a test match, test cricket is healing.pic.twitter.com/YgeXwBlLTM
— zuhaa (@baskrdaybehan) June 20, 2023