రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫెయిలైంది. సెమీస్ వరకు వచ్చినప్పటికీ.. అక్కడ ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. అయితే ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ.. సూపర్-12 దశలో భారత జట్టు విజయాలు సాధించింది. దీంతో 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేస్తూ కప్ కొడుతుందేమోనని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. కానీ సెమీస్ లో ఓడిపోయేసరికి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే పలువురు మాజీ క్రికెటర్లు.. భారత జట్టుతోపాటు అందులో స్టార్ క్రికెటర్లపై విమర్శలు చేశారు. కానీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు అందరికీ చిరాకు తెప్పిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లో నిష్క్రమించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఫేవరెట్ అనడం సరికాదని, వాళ్లకు అంత సీన్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. డైలీ టెలిగ్రాఫ్ కి రాసిన కాలమ్ లో దీనితో పాటు టీమిండియాపై చాలా విమర్శలు చేశాడు. వీటిపై ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ గెలవగానే ఆటగాళ్ల కంటే ఇతడికి ఇగో తలకెక్కిందని మాట్లాడుకుంటున్నారు. భారత్ జట్టుని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో వాన్ కి ఆల్రెడీ తెలుసని, అది గుర్తుంచుకుని మాట్లాడాలని హితవు చెబుతున్నారు.
‘టీ20 వరల్డ్ కప్ పూర్తయింది. ఇక వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సాధించడమే ఇంగ్లాండ్ లక్ష్యం. అందుకు తగ్గట్లే మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యర్థులని దెబ్బకొట్టొచ్చు. ఎందుకంటే టోర్నీ జరిగేది భారత్ లో కాబట్టి. వరల్డ్ కప్ అనగానే టీమిండియాని ఫేవరెట్ అంటారు. నాన్సెన్స్. ఆ జట్టుకు అంత సీన్ లేదు. టీ20 ప్రపంచకప్ లో ఓడించినట్లే వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ ని ఓడిస్తాం. అప్పుడే కాదు మరికొన్నాళ్ల పాటు జరిగేది ఇదే.’ అని వాన్ రాసుకొచ్చాడు. దీంతో భారత అభిమానులు ఇతడిపై విమర్శల దాడి చేస్తున్నారు.