ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేసి వెళ్లారు. కొందరు బ్యాటింగ్ లో అదరగొడితే.. మరికొందరు బౌలింగ్ లో సత్తా చూపారు. మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం రెండింట్లోనూ అదరగొట్టారు. కానీ కొంత మంది క్రికెటర్లు తమ బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అందరి దృష్టిలో పడ్డ ప్లేయర్స్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడు. మలింగతో పాటు పాక్ పేసర్ సోహెల్ తన్వీర్, మరికొంత మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ రకరకాల బౌలింగ్ యాక్షన్ తో అబ్బురపరిచారు. తాజాగా అలాంటి వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్ తోనే వికెట్లు పడగొడుతున్నాడు శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా. వరుస మ్యాచ్ ల్లో కంటిన్యూస్ గా వికెట్లు తీస్తూ.. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నెంబర్ .1 స్థానంలో ఉన్నాడు. మరి ఈ వైవిధ్యమైన బౌలింగ్ వెనుక రహస్యం ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం.
వనిందు హసరంగా.. శ్రీలంక జట్టు ఆసియా కప్ గెలిచేంత వరకు క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. 19 ఏళ్లకే శ్రీలంక జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు.. స్వతాహాగా ఆల్ రౌండర్. హసరంగా తన వైవిధ్యమైన బౌలింగ్ తో కొలంబో క్రికెట్ లీగ్ లో దమ్మురేపాడు. 2017లో జింబాబ్వే పై అరంగ్రేటరం చేసిన తన తొలి వన్డేలోనే హ్యాట్రిక్ తీసి రికార్డుల్లోకి ఎక్కాడు. దాంతో ఒక్కసారిగా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా జట్టులో స్థిరమైన ప్రదర్శన చేస్తూ టీమ్ కు విజయాలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. 2022లో శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో కూడా కీలక భూమిక హసరంగాదే. 6 మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీయడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. కంటిన్యూస్ గా వికెట్లు తీస్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి అతడి బౌలింగ్ యాక్షన్ పై పడింది. దాంతో అతడి బౌలింగ్ యాక్షన్ లో ఏదైనా రహస్యం ఉందా అన్న కోణంలో మాజీలు సైతం ఆలోచిస్తున్నారు.
Wanindu Hasaranga leading the chart for most wickets in the ongoing T20 World Cup so far.#CricTracker #WaninduHasaranga #AFGvSL #T20WorldCup pic.twitter.com/WxuGfOwy1W
— CricTracker (@Cricketracker) November 1, 2022
సాధారణంగా స్పిన్నర్లు బౌలింగ్ వేసేటప్పుడు బంతి గాల్లోనే ఎక్కువ టైమ్ ఉంటుంది. దాంతో బ్యాటర్ కు బాల్ ల్యాండింగ్, కావాల్సినంత టైమ్ దొరుకుతుంది. ఇంకేముంది ఆ బంతి ఫోర్ గానో, సిక్స్ గానో కొట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ హసరంగా లాగా ఫ్లాట్ గా బాల్ ని విసిరినప్పుడు.. బంతి గాల్లో ఉండే సమయం తక్కువ. దాంతో బ్యాటర్ కు భారీ షాట్లు ఆడేందుకు వీలుండదు. బంతి ఫ్లాట్ గా రావడంతో బౌన్స్ కూడా ఎక్కువ కాదు. దాంతో బ్యాట్స్ మెన్ ఇబ్బందికి గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. పైగా ఇలాంటి బౌలింగ్ యాక్షన్ వల్ల బౌలర్ పై శారీరకంగా పెద్దగా ఒత్తిడి ఉండదు. అదీ కాక బ్యాటర్ కు క్రీజ్ లో ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకునే వీలుండదు. బ్యాట్స్ మెన్ కు అర్దం కాకుండా లెగ్ స్పిన్ వేయడంలో హసరంగా సిద్దహస్తుడు.
ఈ క్రమంలోనే హసరంగా ప్రధాన బలం అతడి బౌలింగ్ యాక్షనే అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. పైవన్నీ దృష్టిలో పెట్టుకునే హసరంగా తన బౌలింగ్ యాక్షన్ ను కొనసాగిస్తూ.. స్థిరంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. అయితే కొంత మంది మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ నిపుణులు హసరంగా బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్ పై ICC తక్షణమే విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్ తో బ్యాట్స్ మెన్ దృష్టి మరలే అవకాశాలున్నాయని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో హసరంగా మెరుగైన ప్రదర్శన చేస్తూ.. ఇప్పటికే 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Wanindu Hasaranga with yet another match-winning performance for Sri Lanka.#AFGvSL | #T20WorldCup | @Wanindu49 pic.twitter.com/fl7qXayphR
— CricTracker (@Cricketracker) November 1, 2022