టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మొన్నటి వరకు చాలామంది మాజీలు, నెటిజన్స్.. విరాట్ పనైపోయిందన్నారు. జట్టు నుంచి తప్పుకోవడం బెటర్ అని అన్నారు. కానీ తనపై తనకు నమ్మకం ఉండటంతో ఎవరెన్ని మాటలన్నా సరే పడుతూ వచ్చాడు. వాళ్లందరికీ ఇప్పుడు బ్యాటుతో సమాధానం చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో దుమ్ములేపే ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోడిని ఐసీసీ అవార్డు వరించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన చూపించిన ఆటగాళ్లని గౌరవించడం కోసం ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకొచ్చింది. గతేడాది జనవరి నుంచి వీటిని ఇస్తూ వస్తోంది. ఇక అక్టోబరుకు సంబంధించి విరాట్ కోహ్లీ తొలిసారి నామినేట్ అయ్యాడు. ఇప్పుడు అదే ఊపులో అవార్డు కూడా దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో కోహ్లీ… ఈ ఘనత సాధించగా, మహిళల విభాగంలా పాక్ జట్టుకు చెందిన నిదా దర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా నిలిచింది.
ఇక ఆసియాకప్ లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లోనూ అదరగొడుతున్నాడు. పరుగల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరులోనే కోహ్లీ, రెండు అర్ధ సెంచరీలతో పాటు 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లో పాక్ పై 82 పరుగులు, నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో62 పరుగులు చేసి అలరించాడు. ఇలా అద్భుతంగా రాణించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. కానీ అభిమానులు మాత్రం విరాట్ కే ఈ అవార్డును కట్టబెట్టారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Congratulations to @imVkohli – ICC Player of the Month for October 👏👏#TeamIndia pic.twitter.com/IEnlciVt9T
— BCCI (@BCCI) November 7, 2022