ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో టీమిండియా మాజీ సారథి ‘విరాట్ కోహ్లీ’ నెంబర్-1 క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని పేరిట ఉన్న గణాంకాలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో అభిమానులంతా అతడిని ముద్దుగా G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తుంటారు. అంటే దీనర్థం.. క్రికెట్ ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అన్నట్లు. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిచాడు. నన్ను అలా పిలవద్దని.. ఆ అర్హత తాను ఆరాధించే ఆ ఇద్దరు క్రికేటర్లకు మాత్రమే ఉందని అభిమానులకు తెలియజేశాడు. కోహ్లీ దృష్టిలో ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం..
మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ అందరకీ గుర్తుండే ఉంటుంది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడ్డ భారత జట్టును కోహ్లీ(82), హార్దిక్ పాండ్యా(40)తో కలిసి ఆదుకున్న తీరు అద్భుతం. అది కూడా ఆఖరి 3 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉన్నా.. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించి మ్యాచ్ గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం సోషల్ మీడియాలో ‘విరాట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఇలా ఒక్కటేమిటీ.. కోహ్లీ ఖాతాలో ఇలాంటి ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. దశాబ్దానికి పైగా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఈ రన్ మెషీన్ ను అభిమానులు ‘గోట్’ అని పిలుస్తుంటారు. అయితే కోహ్లీ నన్ను అలా పిలవద్దని అభిమానులకు సూచించాడు. ప్రపంచ క్రికెట్ లో తనకు తెలిసి అలా పిలిచే అర్హత ఇద్దరు దిగ్గజ క్రికెటర్లకు మాత్రమే ఉందని చెప్పిన కోహ్లీ, ఆ ఇద్దరూ తాను ఆరాధించే టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అని చెప్పుకొచ్చాడు.
Team India Emotional
IND vs Pak T20 World Cup Match #ViratKohli𓃵 pic.twitter.com/9nAlqqRThD
— DY Cricket (@DURGESH93359938) October 23, 2022
పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షో లో కోహ్లీ తన భావాలను పంచుకున్నాడు. కోహ్లీని అందరూ ‘గోట్’ అని ఎందుకు పిలుస్తారు..? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. “లేదు.. నన్ను నేను G.O.A.Tగా పరిగణించను. నాకు తెలిసి క్రికెట్ లో గోట్ అని పిలుచుకునే అర్హత ఇద్దరికి మాత్రమే ఉంది. అది సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్..‘ అని బదులిచ్చాడు. కాగా, పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ, 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి మ్యాచ్ నే శాశించాడు. ఇది మరవకముందే ఇవాళ (అక్టోబర్ 27) నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులోనూ 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టడమే తన లక్ష్యమన్న కోహ్లీ, అందుకు 100 శాతం కష్టపడుతున్నాడు. ఇక భారత జట్టు తదుపరి మ్యాచులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 30న జరగనుంది.
Virat Kohli disagrees with the GOAT claims 👑#India #netherlands #indvsned #t20worldcup pic.twitter.com/6G4hqPpRGa
— Sportskeeda (@Sportskeeda) October 27, 2022
Virat Kohli has 12 fifties from just 21 innings in the T20 World Cup history – The GOAT.
— Johns. (@CricCrazyJohns) October 27, 2022