పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు! లేకపోతే ఏంటి అసలు.. టీమిండియాతో మ్యాచ్ అంటే ఎవరికైనా సరే ఫుల్ టెన్షన్. రిజల్ట్ ఏమవుతుందా అని మ్యాచ్ కి ముందే మెంటలెక్కిపోతుంది. దానికి తోడు గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ చేజేతులా ఓడిపోయింది. ఇక ఆ దేశ ప్రజలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు. సరే అయిందేదో అయిపోయింది. తర్వాతి మ్యాచ్ గురించి ఆలోచిస్తాంలే అనుకుంటే.. పాక్ జట్టుకి మరో కష్టం వచ్చి పడింది. ఈసారి బంగ్లాదేశ్ జట్టుతో పోల్చుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సూపర్-12 దశలో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో 9 పరుగుల తేడాతో బంగ్లా జట్టు విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై టీ20ల్లో ఈ జట్టుకి ఇదే తొలి గెలుపు. మరోవైపు పాకిస్థాన్ అయితే ఈ ఫార్మాట్ లోని సూపర్-12 దశలో.. ఇప్పటివరకు ఆసీస్ లో ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదు. భారత్ తో మ్యాచ్ కి ముందు ఆస్ట్రేలియా పాక్ జట్టు.. మూడు టీ20 మ్యాచులే ఆడింది. 2010, 2019ల్లో కూడా ఆసీస్ గడ్డపై టీ20లు ఆడినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు. దీంతో పాక్ జట్టు, క్రికెటర్లని ఆ దేశ ప్రజలే ట్రోల్ చేస్తున్నారు. బంగ్లా టీంని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, మీ కంటే వాళ్లే నయం అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.
ఇదిలా ఉండగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టు చివరి వరకూ పోరాడినప్పటికీ 4 వికెట్లు పడగొట్టిన టస్కిన్ అహ్మద్ బంగ్లా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక భారత్ చేతిలో ఓడిన పాక్.. అక్టోబరు 27న జరిగి మ్యాచ్ లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పాక్ కచ్చితంగా గెలిచి తీరుతుందని, జింబాబర్(బాబర్ ఆజమ్) చెలరేగుతాడని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాక్ గెలిస్తే మాత్రం ఆసీస్ గడ్డపై బోణీ కొట్టేస్తుంది.
Bangladesh has also won a game in Australia and then there is Pakistan 🤣 who haven’t won a game in Australia.
— Cricket🏏 Lover (@CricCrazyV) October 24, 2022
Pakistan’s T20I record in Australia:
Lost vs. 🇦🇺 (2010)
N/R vs. 🇦🇺 (2019)
Lost vs. 🇦🇺 (2019)
Lost vs. 🇦🇺 (2019)Will Pakistan be able to start their #T20WorldCup campaign with their first ever T20I win in Australia? #PAKvIND pic.twitter.com/FofELnNiEH
— #T20WorldCup2022 #INDvPAK #PAKvENG #PAKvNZ #PAKvNZ (@PAKSport_Tv) October 22, 2022
First time ever Bangladesh have won a match in Super 8/10/12 stage of the T20 World Cup
Bangladesh end their 16 match losing streak in Super 8/10/12 stage of the T20 World Cup
— Arnav Singh (@Arnavv43) October 24, 2022