టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ప్రయాణం పడుతూ.. లేస్తూ సాగుతోంది. వరుస విజయాలతో జోరు మీద కనిపించిన ప్రొటీస్ జట్టు, పాకిస్తాన్ పై ఓటమితో సందిగ్ధంలో పడింది. తమ ఆఖరి మ్యాచులో విజయం సాధిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టం. ఇప్పటివరకు ప్రొటీస్ జట్టు ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఓటమి పాలవగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆఖరి మ్యాచులో నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జరిగితే విజయం సాధించడం పక్కా. అయితే వర్షం ముప్పు పొంచివుండడం వారికున్న అతి పెద్ద గండం. దీనంతటికి కారణం.. ఆ జట్టు సారధి టెంబా బవుమా.
గడిచిన కొంతకాలంగా బవుమా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టీ20లలో అతడి ఆట నానాటికీ దిగజారుతోంది. టీ20లలో బవుమా స్ట్రైక్ రేట్ 116.69గా ఉండగా సగటు 22.77 మాత్రమే. అందులోనూ ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ లో ధారుణంగా విఫలమయ్యాడు. 2, 2, 13, 36.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో అతని స్కోర్లు. ఒక సారధిగా ముందుండి నడిపించాల్సిన బవుమా, క్రీజులో నిలబడటానికే బద్దకమన్నట్లు తొందరగా పెవిలియన్ దారి పడుతున్నాడు. ఈ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో అతనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజగా, ప్రొటీస్ సారధి వైఫల్యాలపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్.. కెప్టెన్ అనే ఒకే ఒక్క కారణంతో అతను జట్టులో ఉన్నాడు తప్ప.. లేకుంటే అతనికి జట్టులో స్థానమే ఉండదని వ్యాఖ్యానించాడు. “బవుమా దక్షిణాఫ్రికా కెప్టెన్ కాకపోతే అతను జట్టులో ఉండేవాడు కాదు.. అతని కోసం మంచి ఫామ్ లో ఉన్నరీజా హెండ్రిక్స్ బెంచ్ కు పరిమితమవుతున్నాడు..” అని జాఫర్ చెప్పుకొచ్చాడు.
Wasim Jaffer on captain Temba Bavuma’s current form in this 20-20 World Cup via @batbricks7 presents ‘Run Ki Runneeti.’#CricTracker #BatBricks7 #RunKiRunneeti #PAKvSA pic.twitter.com/jJbho5er38
— CricTracker (@Cricketracker) November 3, 2022
టీ20 ప్రపంచకప్-2022 పక్కన పెట్టినా, గత 9 ఇన్నింగ్స్ లలో టీ20 ఫార్మాట్ లో బవుమా చేసిన పరుగులు వరుసగా.. 8(10), 8*(11), 0(4), 0(7), 3(8), 2*(2), 2(6), 13(15), 36(19). అంతేకాదు మొత్తంగా ఇప్పటి వరకు 32 అంతర్జాతీయ టీ20లు ఆడిన బవుమా సాధించిన పరుగులు 615. అత్యధిక స్కోరు 72కాగా, ఒకే ఒక హాఫ్ సెంచరీ. ఈ గణాంకాలతో అతడు జట్టులో ఉండటమే గొప్ప అనుకుంటే.. అతడు ఏకంగా సారధ్య బాధ్యతలే నిర్వర్తిస్తున్నాడు. మరో విషయం.. ఇతని ఆట తీరు చూసి ఇటీవల సౌతాఫ్రికా వేదికగా జరిగిన ‘ఎస్ఎ టీ20 లీగ్’ వేలంలో అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదంటేనే అర్థం చేసుకోవచ్చు అతడి ఆట ఎలా ఉందో అన్నది.
Temba Bavuma in the last 7 innings in T20I: 8(10), 8*(11), 0(4), 0(7), 3(8), 2*(2) & 2(6).
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
Points Table of Group 2#T20WorldCup #PAKvSA pic.twitter.com/AAAhyNj3tZ
— RVCJ Media (@RVCJ_FB) November 3, 2022