ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? సందేహం లేకుండా అందరూ చెప్పే మాట వరుణుడు! ఇది మేం ఏదో కల్పించి చెబుతున్నది కాదు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జరగబోయేది ఇదే అని పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. ఇక్కడ అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి సిట్చూయేషన్. టోర్నీలో సూపర్-12 దశ మొదలై ఐదురోజులైనా కాలేదు అప్పుడే వర్షం వల్ల మూడు మ్యాచులు ఎఫెక్ట్ అయ్యాయి. ఫలితాలే మారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లు సిద్ధంగా ఉంటే సరిపోదు. వాతావరణం కూడా అనుకూలించాలి. వర్షం పడినా, ఎండ ఎక్కువైనా సరే మ్యాచ్ ఆడటం కష్టమవుతుంది. ఎండైతే ఎలాగోలా మేనేజ్ చేసి ఆడేయొచ్చు. కానీ వర్షం పడితే మాత్రం ఒక్క బంతి కూడా పడదు. ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ లకు ఇబ్బంది ఎప్పుడూ ఉండేదే. కానీ టీ20 వరల్డ్ కప్ లాంటివి నిర్వహించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా జరుగుతున్న టోర్నీనే చూస్తుంటే ఐసీసీని తిట్టాలి అనిపించేంత కోపం వస్తోంది. ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని మ్యాచులకు ఇలా వర్షం అడ్డంకిగా నిలిచింది.
వర్షం వల్ల సోమవారం, దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా గెలిచేస్తుంది అని టైంకి మళ్లీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ ని రద్దు చేశారు. ఇక బుధవారం కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంగ్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ టైంలో వర్షం పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. దీని తర్వాత జరగాల్సిన ఆఫ్ఘానిస్ధాన్-న్యూజిలాండ్ మ్యాచ్ అయితే.. కనీసం టాస్ పడకుండానే రద్దయింది. రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చేశారు. జస్ట్ రోజుల వ్యవధిలోనే మూడు మ్యాచ్ లు వర్షానికి ఎఫెక్ట్ అయితే.. ఇక రాబోయే మ్యాచ్ ల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వర్షకాలంలో వరల్డ్ కప్ ఏంటి.. ఐసీసీకి ఆ మాత్రం తెలివి లేదా అని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. అలానే దీన్ని వర్షాల వరల్డ్ కప్ అని విమర్శిస్తున్నారు. మరి ఈసారి వరల్డ్ కప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Rain plays spoilsport at the MCG 🌧
Afghanistan and New Zealand share points after the match is called off!#T20WorldCup | #NZvAFG pic.twitter.com/2Z8TmuX1gz
— ICC (@ICC) October 26, 2022
This one will be called off soon.
Rain might’ve ruined an awesome game.
🌧️ 🏏 #T20WorldCup #AFGvNZ pic.twitter.com/PxxuDzcbR8
— Lachy (@Lachy_Steele) October 26, 2022
Losing a game to rain is worse than losing it on the last ball. Bad weather has already impacted too many results in this #ICCT20WorldCup. In the end it’s the fans who lose. Won’t say it’s a good point for #AFG. They can beat anyone on their day. Must-win games ahead now#NZvAFG pic.twitter.com/IGB0gVsi4q
— Hameed Shuja (@hameedshuja) October 26, 2022