టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరా? అన్నది తేలిపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీస్ లో భారత్ తో అమీ.. తుమీ.. తేల్చుకోనుంది. అయితే అలా జరగాలంటే.. ముందు భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించాలి. ఆదివారం జరగబోయే ఇండియా- జింబాబ్వే మ్యాచుతో దీనికి తెరపడనుంది. ఈ మ్యాచులో విజయం సాధించినా.. వర్షం కారణంగా రద్దయినా.. భారత జట్టు సెమీస్ చేరడం పక్కా. ఓడితే మాత్రం లెక్కలు తారుమారవుతాయి. మరి.. భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఎలా ఉన్నాయి?.. ఆఖరి మ్యాచులో ఏమైనా ప్రయోగాలు చేయనున్నారా! అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచులాడిన భారత జట్టు మూడింటిలో గెలుపొందగా, ఒక మ్యాచులో ఓటమిపాలైంది. ఫలితంగా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తన చివరి మ్యాచులో జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచులో భారత్ వైపే విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నా.. జింబాబ్వేని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అసలే దాయాది జట్టు పాకిస్తాన్ ను మట్టి కరిపించి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది.. జింబాబ్వే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. అన్నీ సవ్యంగా జరిగి భారత జట్టు ఈ మ్యాచులో విజయం సాధించింది అనుకుంటే.. సెమీస్ కు అర్హత సాధించడమే కాకుండా.. గ్రూప్-2లో అగ్రస్థానంలో కూర్చుంటుంది.
Points Table from Group 2#T20WorldCup #INDvBAN pic.twitter.com/h7F6ZFvZDS
— RVCJ Media (@RVCJ_FB) November 2, 2022
ఐసీసీ నిబంధనల ప్రకారం.. రెండు గ్రూపులోని 4 జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-1 నుంచి రెండు జట్లు న్యూజిలాండ్(A1), ఇంగ్లాండ్(A2), గ్రూప్-2 నుంచి రెండు జట్లు B1, B2 అర్హత సాధిస్తాయి. ఆ తరువాత షెడ్యూలు ప్రకారం.. గ్రూప్-1లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు(A1).. గ్రూప్-2లోని రెండో స్థానంలో ఉన్న జట్టు(B2)తో, గ్రూప్-2లో మొదటి స్థానంలో ఉన్న జట్టు(B1).. గ్రూప్-1లోని రెండో స్థానంలో ఉన్న జట్టు(A2)తో తలపడాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత జట్టు, జింబాబ్వేపై గెలుపొందింది అనుకుంటే.. గ్రూప్-2 నుంచి అగ్రస్థానంలో ఉంటుంది కనుక.. గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్(A2) జట్టుతో తలపడాల్సి రావొచ్చు.
The final standings in Group 1!
New Zealand will play the first semi-final in Sydney on Wednesday; England will face the winner of Group 2 in Adelaide on Thursday. #T20WorldCup pic.twitter.com/sNon6YOJyJ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2022