టీమిండియా బౌలింగ్ అనగానే బుమ్రా గురించే అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి బుమ్రా.. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఇక దీని కంటేమ ముందు జరిగిన ఆసియాకప్ లో మన బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో బ్యాటింగ్ పరంగా ఎలాంటి బెంగ లేనప్పటికీ.. బౌలింగ్ లో కచ్చితంగా దెబ్బపడుతుందని అభిమానులు మానసికంగా ఫిక్సయిపోయారు. కానీ రియాలిటీ మాత్రం పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బుమ్రా లేకపోయినా సరే మన బౌలర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అదే విషయం గురించి స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ లీగ్ దశలోనే మ్యాచులు ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. దీంతో ఈసారి ఏం చేస్తుందా అనే అందరిలోనూ ఒకటే టెన్షన్. ఇక దాన్ని పూర్తిగా చెరిపేసిన టీమిండియా.. పాక్, జింబాబ్వేపై వరస విజయాలు సాధించింది. టాప్ క్లాస్ ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్, హార్దిక్ పాండ్య.. ఫుల్ కాన్సిడెన్స్ తో కనిపించారు. అలానే దంచికొట్టారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. అందరూ సందేహపడ్డ భువనేశ్వర్ కుమార్.. తొలి రెండు మ్యాచుల్లో కలిపి 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 30 డాట్ బాల్స్ వేసి, 4.43 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు బయటపెట్టాడు.
‘ఇన్నేళ్ల కెరీర్ లో ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మాత్రమే సరిగా బౌలింగ్ చేయలేకపోయాను. మీడియా, కామెంటేటర్స్, ఫ్యాన్స్ చాలా చెప్పారు. డెత్ బౌలింగ్ సరిగా లేదని కామెంట్స్ చేశారు. కానీ నా బలం ఏంటో నాకు బాగా తెలుసు. బుమ్రా లాంటి బౌలర్ టీ20 వరల్డ్ కప్ జట్టులో లేకపోవడం పెద్ద లోటే. అతడు ఉండుంటే ఇంకా బలముండేది. అయితే బుమ్రా లేకపోయినా సరే మ్యాచులు గెలుస్తామని నిరూపించడానికి ఇక్కడికొచ్చాం. బలాలు బలహీనతులు తెలుసు. అందుకే గెలవడానికి ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్స్ వేస్తున్నాం’ అని భువనేశ్వర్ అన్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే… బుమ్రా లేకుండానే ఈసారి భారత్ కప్ కొట్టేలా కనిపిస్తోంది!
The India fast bowler adds that he is unfazed by the criticisms he received for his poor show at the death in the Asia Cup and cuts himself off social media during big tournaments like the World Cup.#BhuvneshwarKumar #IND #T20WorldCup pic.twitter.com/93u5uMa9VL
— Cricket.com (@weRcricket) October 29, 2022
Bhuvneshwar Kumar becomes first Indian bowler to bowl 2 consecutive maiden overs in men’s T20I Internationals history.#bhuvneshwarkumar #INDvsNED pic.twitter.com/a5xKgIQG2n
— RS Vipan 💙 (@RSVipan) October 27, 2022
Bhuvneshwar Kumar has bowled 30 dot balls from 7 overs in the T20 World Cup 2022.
— Johns. (@CricCrazyJohns) October 29, 2022