జస్ప్రీత్ బుమ్రా. టీమిండియాకు దొరికిన అద్భుతమైన పేసర్. కానీ గత 5-6 నెలల నుంచి గాయాల కారణంగా మ్యాచులు ఏం ఆడట్లేదు. అయితే రోహిత్ చేస్తున్న ఓ ఆలోచన మాత్రం బుమ్రాని రిస్క్ లో పెట్టేలా ఉంది. ఇంతకీ ఏంటా విషయం?
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా ఫ్యాన్స్ ఈ పేరు విని చాలా కాలమైపోయింది. అప్పుడెప్పుడో ఐపీఎల్, ఆ తర్వాత ఆసియాకప్ లో కనిపించాడు. రీఎంట్రీ ఇచ్చి రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. బుమ్రా గాయం పెద్దదేం కాదని, 2-3 వారాల్లో జట్టులోకి వచ్చేస్తాడని కోచ్ ద్రవిడ్ ధీమాగా చెప్పాడు. ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ బుమ్రా జాడ లేకుండా పోయింది. కివీస్ తో సిరీస్ కు ఇతడిని ఎంపిక చేస్తున్నామని చెప్పిన బీసీసీఐ.. ఇంకా కోలుకోలేదు తూచ్ అని చెప్పి బుమ్రాని సెలెక్ట్ చేయలేదు. తాజాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనూ బుమ్రా ఆడట్లేదు. దీంతో అసలు బుమ్రా విషయంలో ఏం జరుగుతుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బుమ్రా తనకు అయిన గాయం నుంచి ఎప్పుడో కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం అతడిని ఆడించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా అనిపిస్తుంది. లేకపోతే ఏంటి మరి.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు బుమ్రాని ఎంపిక చేస్తారని అన్నారు. ఇప్పుడు అదేం లేదనే మాట వినిపిస్తుంది. రోహిత్ కు కూడా బుమ్రాని ఆడేంచేందుకు ఆసక్తి చూపించటం లేదట. ఎందుకంటే స్వదేశంలో టెస్టులంటే బౌలింగ్ మొత్తం స్పిన్నర్లు చూసుకుంటారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కొన్ని ఓవర్లు పేసర్లతో వేయిస్తే సరిపోతుంది. ఆ పని చూసుకోవడానికి ఎలానూ షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఉండనే ఉన్నారు. అందుకే బుమ్రాని టెస్టుల్లో ఆడించడం లేదని తెలుస్తోంది.
టెస్టుల తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా భారత జట్టు ఆడనుంది. ఇందులో బుమ్రాని ఆడిస్తారా? అంటే అది అనుమానమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరఫున 14-17 మ్యాచులు ఆడాలంటే ఫిట్ గా ఉండాలి. అలా ఉండాలంటే టెస్టులు, వన్డేల్లో బుమ్రాని ఆడించకపోవడమే మంచిదని ముంబయి టీమ్ మేనేజ్ మెంట్ రోహిత్ కు సూచనలు ఇచ్చిందట. అందుకే టెస్టు సిరీస్ లో బుమ్రాని ఆడించేందుకు రోహిత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట.
అయితే ఇక్కడ ఇంకో రిస్క్ కూడా ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలిస్తే.. మనం టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ ముగిసిన 10 రోజుల్లోనే ఆ మ్యాచ్ ఉంది. అది ఇంగ్లాండ్ లోని ఓవల్ లో జరుగుతుంది. అందులో కచ్చితంగా బుమ్రాని ఆడిస్తారు. ఇదే కాకుండా నవంబరులో వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి రెస్ట్ ఇస్తున్నారు ఓకే.. ఒకవేళ ఐపీఎల్ లో బుమ్రా ఆడితే మాత్రం అందరూ విమర్శించడం గ్యారంటీ. ఇది కాదన్నట్లు ఒకవేళ ఈ టోర్నీలో ఆడుతూ బుమ్రా గాయపడితే మాత్రం.. అతడి లైఫ్ ని కెప్టెన్ రోహిత్ రిస్క్ లో పెట్టినట్లే అవుతుంది. ఏదైనా తేడా కొడితే మొత్తం కెరీర్ కే ప్రమాదం ఏర్పడుతుంది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.