ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్ వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే తన తండ్రి సచిన్ 14 ఏళ్ల పగని చల్లార్చాడు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
క్రికెట్ చూసేవాళ్లకు దిగ్గజ సచిన్ టెండూల్కర్, ఆయన ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకు అర్జున్ ఆల్రెడీ క్రికెటర్ గా పేరు తెచ్చకునే పనిలో ఉన్నాడు. గత కొన్నేళ్ల నుంచి ఐపీఎల్ లోని ముంబయి ఇండియన్స్ లో ఉన్నప్పటికీ.. ఆడే ఛాన్స్ అయితే రాలేదు. రీసెంట్ గా కోల్ కతా నైటరైడర్స్ తో మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు కానీ వికెట్ తీయలేకపోయాడు. తాజాగా హైదరాబాద్ తో మ్యాచ్ లో ఫస్ట్ వికెట్ తీశాడు. అయితే ఇది అర్జున్ కి చాలా స్పెషల్. దీని వెనక ఓ రీజన్ కూడా ఉందండోయ్. మరి అదేంటో తెలుసా?
అసలు విషయానికొస్తే.. ఎక్కడలేని వింతలన్నీ క్రికెట్ లోనే జరుగుతూ ఉంటాయి. ఎంత స్టార్ ప్లేయర్ వారసుడైనా సరే సరిగా ఆడకపోతే ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ బాగా బౌలింగ్ చేస్తే.. ట్రోల్ చేసినవాళ్లే మెచ్చుకుంటారు. ఇవన్నీ అర్జున్ టెండూల్కర్ విషయంలో జరిగాయి. దిగ్గజ సచిన్ కొడుకు కావడంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా అర్జున్ పై ఉండేది. దేశవాళీ మ్యాచ్ ల్లో ఓ మాదిరిగా ఆడినప్పటికీ.. ఛాన్సులు అతడికి ఎక్కువగా ఇస్తున్నారని కొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. సరే అది పక్కనబెడితే ముంబయి ఇండియన్స్ లో జట్టులో ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే. అయితే అది మొన్నటివరకు.
తాజాగా సన్ రైజర్స్ తో హైదరాబాద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టు గెలిచింది. లాస్ట్ ఓవర్ లో 20 పరుగులు చేస్తే సన్ రైజర్స్ గెలుస్తుంది. అలాంటి టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. అర్జున్ కి బౌలింగ్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని అర్జున్.. వరసగా 0, 1 రనౌట్, వైడ్, 2, Lb 1,w.. ఇలా పొదుపు బౌలింగ్ చేయడంతో పాటు భువనేశ్వర్ వికెట్ కూడా తీశాడు. ఇలా భువీని ఔట్ చేయడంతో 14 ఏళ్ల పగ చల్లార్చుకున్నాడు. ఎందుకంటే 2009లో ఇదే స్టేడియంలో రంజీ మ్యాచ్ సందర్భంగా సచిన్ ని పేసర్ భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశాడు. ఇప్పడు అదే సచిన్ కొడుకు.. భువనేశ్వర్ ని ఔట్ చేశాడు. సో అలా సచిన్ 14 ఏళ్ల పగని కొడుకు అర్జున్ తీర్చాడనమాట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Both instances have come at Rajiv Gandhi Stadium, Uppal in Hyderabad, 14 years apart! https://t.co/0S7f23AjWd
— Bharath Seervi (@SeerviBharath) April 18, 2023