ఐపీఎల్ లో సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ పై ఓడిపోయిన మ్యాచ్ లోనూ తన మార్క్ చూపించి, సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్.. తాజా ఐపీఎల్ లో చాలా ఘోరమైన ప్రదర్శన చేసింది. అసలు గెలవడం ఇంట్రెస్ట్ లేదన్నట్లు మ్యాచ్ ల్లో ఆడింది. దీంతో జట్టుని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా సన్ రైజర్స్ ని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. జట్టులోని దాదాపు ఆటగాళ్లందరూ పెట్టిన డబ్బులకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఇంతటి దారుణమైన స్థితిలోనూ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏంటా రికార్డు? దాని సంగతేంటి?
అసలు విషయానికొచ్చేస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడింది. 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 188/9 స్కోరు చేసింది. గిల్ సెంచరీ చేసి జట్టు ఈ పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో హైదరాబాద్ జట్టు 154/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. అందరూ సన్ రైజర్స్ ని తిడుతున్నారు గానీ భువనేశ్వర్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇది కాస్త మరుగున పడిపోయింది.
ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్.. తన స్వింగ్ తో సాహా, గిల్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, షమి వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ రనౌట్ లోనూ భాగమయ్యాడు. దీనితోపాటు క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ 27 పరుగులు గెలిపించడానికి ప్రయత్నించాడు. ఓవరాల్ ఐపీఎల్ లోని ఓ మ్యాచ్ లో 25 రన్స్ ప్లస్ 5 వికెట్ల తీసిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు. చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ లో ఉన్నాడు. గతంలో డెక్కన్ ఛార్జర్స్ పై 48 రన్స్ కొట్టడంతోపాటు 5 వికెట్లు తీశాడు. మరి భువనేశ్వర్ ఐపీఎల్ లో అరుదైన రికార్డు సెట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
What a final over by Bhuvi !!#GTvsSRH #GTvSRH #SRHvsGT #srhvgt #IPL2023 #IPL #TATAIPL #Shubmangill #HardikPandya #RashidKhan #gujarattitans #SunrisersHyderabad #AavaDe #MohammadShami #bhuvi #AidenMarkram #CricketTwitter #kavyamaran #bhuvneshwarkumarpic.twitter.com/mMJhhfMhIY
— SportzCraazy (@sportzcraazy) May 15, 2023