టీ20 వరల్డ్ కప్ లో ఈసారి టీమిండియా ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగింది. గతేడాది లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టేయడంతో ఈసారి మ్యాచులు మొదలయ్యేంత వరకు అభిమానుల్లో పెద్దగా జోష్ లేదు. ఎప్పుడైతే పాక్ తో తొలి మ్యాచ్ లో గెలిచామో.. ఆటగాళ్లతో పాటు అభిమానులకు ఒక్కసారిగా ఊపొచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచింది. ఇక నెదర్లాండ్స్ పై కూడా గెలిచేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే విషయమై భారత మాజీ ఆటగాడు.. షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా బ్యాటింగ్ విషయంలో ఎవరికీ భయం లేదు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్లు మన జట్టులో ఉన్నారు. వీళ్లలో రాహుల్ తప్పించి మిగిలిన అందరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఆసియాకప్ లో మన బౌలర్ల ప్రదర్శన చూసి చాలామంది డైరెక్ట్ గానే కౌంటర్లు వేశారు. ఇదే బృందంతో వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో తేలిపోతామని కామెంట్స్ చేశారు. బుమ్రా కూడా గాయపడేసరికి ఇక అంతే సంగతులు అని ఫిక్సయ్యారు. కానీ భువీతో పాటు అర్షదీప్, షమి తదితరులు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ విజయాల్లో కారణమయ్యారు.
అసలు సమస్య మొత్తం ఫీల్డింగ్ తోనే వచ్చి పడింది. ఎందుకంటే రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, సులభంగా వచ్చిన క్యాచ్ ని వదిలేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. చాలా ఈజీ రనౌట్ ని మిస్ చేశాడు. మనం ఈ మ్యాచ్ లో గెలిస్తే, పాక్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యేవి. కానీ మనం ఓడిపోవడం, కోహ్లీ-రోహిత్ శర్మ ఫీల్డింగ్ చూసి పాక్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అంతా ఫిక్సింగ్ అని ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ఇదంతా వదిలేస్తే టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. మన ఫీల్డింగ్ పై మాట్లాడలేని విధంగా విమర్శలు చేశాడు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడే.. ఫీల్డింగ్ పరంగా జట్టు సమతూకంగా ఉండేదని, రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశాడని అన్నాడు. అశ్విన్, షమి.. బాగా బౌలింగ్ చేస్తారు గానీ ఫీల్డింగ్ విషయంలో ఇలాంటి వాళ్లు పనికిరానని అజయ్ జడేజా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా భారత్ తన తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడనుంది. అడిలైడ్ లో బుధవారం ఈ పోరు జరగనుంది.
Virat Kohli drops a catch & Rohit Sharma misses a run-out❌
Aiden Markram survivies twice in an over!
📸: Disney + Hotstar pic.twitter.com/pxAjo6xsWS
— CricTracker (@Cricketracker) October 30, 2022