2022 టీ20 ప్రపంచ కప్ రసతవత్తరంగా సాగుతోంది. ప్రారంభ మ్యాచ్ సంచలనంతో మెుదలై.. ఇండియా-పాక్ మ్యాచ్ తో ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది టోర్నీ. మధ్య మధ్య లో వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. ప్రపంచ కప్ మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా సిడ్నీ గ్రౌండ్ లో బంగ్లాదేశ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అయిన రైలీ రోస్సో.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వారి బౌలింగ్ ను ఊచకోత కోస్తు శతకం బాదాడు. దాంతో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వాతావరణం ఎప్పుడు ఏవిధంగా మారుతుందో ప్రస్తుత ప్రపంచ కప్ లో తెలియడం లేదు. దాంతో ముందు బ్యాటింగ్ కు దిగే జట్టు వీలైనంత త్వరగా భారీగా పరుగులు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. దాంట్లో భాగంగానే టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా మెరుపు వేగంతో పరుగులు చేయడం ప్రారంభించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తస్కిన్ బౌలింగ్ లో కెప్టెన్ టెంబా బావుమా 2 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రైలీ రోస్సో.. మరో ఓపెనర్ డి కాక్ తో కలిసి బంగ్లాదేశ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రోస్సో బంగ్లా బౌలర్లను పగపట్టినట్లు చితక్కొట్టాడు. మైదానం నలువైపులా ఎడా పెడా బౌండరీలను బాదుతూ.. స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలనే 52 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్ లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు.
Hundred for Rilee Rossouw, this is just incredible hitting, 100* from 52 balls including 7 fours and 7 sixes.
He returned into South African team after 6 long years in 2022. pic.twitter.com/H4E7eyNyXF
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
అనంతరం భారీ షాట్ కు ప్రయత్నించి బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రోస్సో 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్ లతో 109 పరుగులు చేశాడు. మరోవైపు అతడికి సహకారం అందిస్తూ.. డి కాక్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 63 రన్స్ చేశాడు. వీరిద్దరి ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 205 భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా రోస్సో ఊచకోతకు బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ బలైయ్యాడు. 3 ఓవర్లోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లను కూడా రోస్సో వదల్లేదు. అనంతరం 205 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 11.4 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 76 పరుగుల వద్ద ఉంది. ప్రోటీస్ బౌలర్ నోర్టీజ్2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు.
Rilee Rossouw – 109 (56) | 4⃣ x7⃣, 6⃣ x8⃣
Sublime. 👏#SAvBAN pic.twitter.com/5O2PdzJvBY
— MI Cape Town (@MICapeTown) October 27, 2022
CENTURY ALERT
South Africa dasher Rilee Rossouw brings up his second T20I century and the first one at this year’s tournament#T20WorldCup | #SAvBAN | 📝https://t.co/Ji9TL3CpQ9 pic.twitter.com/45g0t2Jqav
— ICC (@ICC) October 27, 2022