SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sikandar Raza Is A New Legend In Zimbabwe Cricket

కోహ్లీని మించిన మొనగాడు! జింబాబ్వే క్రికెట్ లో నయా హీరో సికందర్ రాజా లైఫ్ స్టొరీ!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీని మించిన మొనగాడు! జింబాబ్వే క్రికెట్ లో నయా హీరో సికందర్ రాజా లైఫ్ స్టొరీ!

రెండు దశాబ్దాల క్రితం జింబాబ్వే పేరు చెబితే పెద్ద పెద్ద జట్లకు కూడా తడిసిపోయేది. వరల్డ్‌ కప్‌ వేదికలపై ఛాంపియన్‌ జట్లకు కూడా ఝలక్‌ ఇచ్చిన టీమ్‌ జింబాబ్వే. ఏడాది క్రితం వరకూ గతమెంతో ఘనం అన్న రితీలో జింబాబ్వే ప్రస్థానం సాగింది. తిరిగి ఒక ఏడాది కాలం నుంచి పాత జింబాబ్వేను గుర్తుచేస్తోంది ప్రస్తుత టీమ్‌. ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వే మునుపటి వైభవాన్ని అందుకుంటోంది. క్వాలిఫయర్‌ స్టేజ్‌ దాటి.. సూపర్‌-12 స్టేజ్‌కు అర్హత సాధించిన జింబాబ్వే, సూపర్‌ -12 స్టేజులో టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్ కు గట్టి షాకిచ్చింది. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇక్కడ పాక్ ఓటమిని శాసించింది మాత్రం.. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజానే. దీంతో అతడి పేరు మార్మోగుతోంది.

జింబాబ్వే సూపర్‌- 12లోకి ఎంట్రీ ఇవ్వడమే గొప్ప విషయం అంటే.. ఇప్పుడు పాకిస్తాన్ పై గెలవడం మరో సంచలనం. జట్టులోని ఆటగాళ్లకు సరైన షూలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితి నుంచి నేడు టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ లాంటి పెద్ద టీమ్స్‌తో పోటీ పడేందుకు సిద్ధమైంది. 1983 వన్డే వరల్డ్‌ నుంచి ప్రారంభమైన జింబాబ్వే సంచలన ప్రస్థానం కొన్నేళ్లపాటు అలాగే సాగింది. ఎంత పెద్ద టీమ్‌ అయినా.. జింబాబ్వేతో మ్యాచ్‌ అంటేనే ఒళ్లుదగ్గరపెట్టుకుని ఆడే పరిస్థితి. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ఇలా పెద్ద టీములుగా పేరుమోసిన జట్లు కూడా ఒకానొక దశలో జింబాబ్వే జట్టకు తలొంచాయి. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన జింబాబ్వే టీమ్‌కు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పూర్వవైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆండీ ఫ్లవర్‌, బ్రెండన్‌ టేలర్‌, గ్రాంట్‌ ఫ్లవర్‌, అలిస్టర్ కాంప్‌బెల్ లాంటి హేమాహేమీల హయాంలో ఒక వెలుగు వెలిగిన జింబాబ్వే క్రికెట్‌కు.. మళ్లీ సికందర్‌ రజా, క్రెయిగ్‌ ఇర్విన్‌, సీన్‌ విలియమ్స్‌, రియాన్‌ బర్ల్‌ తిరిగి పునఃవైభవం తీసుకొస్తున్నారు.

Wearing the badge with pride. Let’s go Zimbabwe! 🇿🇼 #T20WorldCup

📹 @icc pic.twitter.com/sx38i2uSoA

— Zimbabwe Cricket (@ZimCricketv) October 16, 2022

ముఖ్యంగా ఆ జట్టు ఆల్ రౌండర్ సికందర్‌ రజా గురించి చెప్పుకోవాలి. స్వదేశంలో బంగ్లాదేశ్‌, ఇండియా ఇతర జట్లతో జరిగిన సిరీస్‌లలో మంచి ప్రదర్శన కనబర్చిన రజా.. జింబాబ్వేను టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 12కు చేర్చడంలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌ సంతతికి చెందిన సికందర్‌ రజా ప్రస్తుతం జింబాబ్వే టీమ్‌లో ఒక స్టార్‌. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. అదే మరో పెద్ద టీమ్‌లో ఉండి ఉంటే రజా వేరే స్థాయిలో ఉండే వాడు కానీ.. అవన్నీ వదులుకొని జింబాబ్వేను మరో స్థాయి తీసుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో మూడు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. సూపర్‌ 12కు అర్హత సాధించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కలిపి సికందర్‌ రజా 136 పరుగులు సాధించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించాడు.

That winning feeling 🙌#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/7lxwYaHWpA

— Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022

ఇక, తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ లో మాత్రం పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసిన రజా 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో రజా అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. రజా 7 అవార్డులు గెలుచుకోగా, విరాట్ కోహ్లీ 6 అవార్డులతో రెండో స్థానంలో న్నాడు. క్వాలిఫయింగ్ మ్యాచులతో కలిపి ఒక్క ఈ వరల్డ్ కప్ లోనే రజాకు 3 మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు రావడం విశేషం. 2013 నుంచి జింబాబ్వే తరఫున 123 మ్యాచ్‌లు ఆడిన రజా.. 118 ఇన్నింగ్స్‌ల్లో 3656 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

🇿🇼 beat Pakistan 🇵🇰 by one run! 🔥#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/jTgHlwzC9r

— Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022

The Player of the Match, for his figures of 3/25, is @SRazaB24! 👏#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/TU7Dqet5h4

— Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022

Tags :

  • Cricket News
  • Sikandar Raza
  • T20 World Cup 2022
  • virat kohli
  • zimbabwe
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam