టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును నెదర్లాండ్స్ పై కూడా చూపింది. నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కింగ్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు అర్దశతకాలతో చెలరేగారు. కోహ్లీ మరో సారి క్లాస్ ఇన్నింగ్స్ తో చెలరేగగా.. మిస్టర్ 360 గా పేరుగాంచిన SKY తనదైన స్టైల్లో మరోసారి రెచ్చిపోయాడు. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కోహ్లీ సొగసైన బ్యాటింగ్ చూస్తే.. ఎవరైనా ఫిదా కావాల్సిందే. చూడముచ్చటైన షాట్లతో నెదర్లాండ్ బౌలర్లకు సవాల్ విసిరాడు. అయితే ఈ మ్యాచ్ లో క్లాసెన్ బౌలింగ్ లో కవర్స్ మీదుగా కొట్టిన ఓ ప్లాట్ సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఈ సిక్స్ షాట్ ఆఫ్ ది మ్యాచ్ కాగా.. ఆ తర్వాత కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ కూడా సరదాగా ఉంది.
స్టైల్లో రజినీకాంత్.. క్రికెట్ లో సచిన్ టెండుల్కర్.. వీరిద్దరిని కలిపితే కింగ్ విరాట్ కోహ్లీ. రజినీకాంత్ లోని స్టైలిష్ నెష్ ని, సచిన్ లోని టెక్నిక్ ను పునికిపుచ్చుకున్నాడు కోహ్లీ. క్రీజ్ లో విరాట్ ఉన్నాడు అంటే చాలు భారత్ కు కొండంత అండ. ఇటీవలి పాక్ మ్యాచ్ లో దానిని నిరూపించాడు కోహ్లీ. తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో మరోసారి తనకు అచ్చొచ్చిన సిడ్నీ గ్రౌండ్ లో రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అద్భుతమైన షాట్ కొట్టాడు. ఈ షాట్ ను చూసి ప్రేక్షకులతో పాటు క్రీడా దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అది 16వ ఇన్నింగ్స్.. నెదర్లాండ్ బౌలర్ క్లాసెన్ బౌలింగ్ కు దిగాడు. అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న కోహ్లీ.. సొగసైన షాట్లతో విరుచుకుపడుతున్నాడు.
ఇక ఈ ఓవర్ లో మూడవ బంతిని కవర్స్ పై నుంచి ప్లాట్ సిక్స్ గా మలిచిన తీరు అమోఘం. ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్ అది. కోహ్లీలా ప్రపంచంలో మరే ఇతర ఆటగాడు కూడా ఆ షాట్ కొట్టలేడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ షాట్ ను షాట్ ఆఫ్ ది మ్యాచ్ గా వర్ణిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇక ఈ సిక్స్ కొట్టిన తర్వాత సూర్యకుమార్ ను చూస్తూ.. కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. దాంతో అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ..”నిజమే కింగ్ కోహ్లీ ఈ షాట్ ను నువ్వు తప్ప మరెవరూ కూడా కొట్టలేరు” నీ సొగసైన బ్యాటింగ్ కు మేం ఫిదా అయ్యం విరాట్” ప్రశంసలు కురిపిస్తున్నారు.
Shot of the match – Virat Kohli. pic.twitter.com/S5DsDN07HC
— Johns. (@CricCrazyJohns) October 27, 2022