“నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది” అన్నారు పెద్దలు. నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే.. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. వారు ఏదైన మాట్లాడితే ఆ మాట క్షణాల్లో వైరల్ అవుతుంది. కాబట్టి వారు మాటజారేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే అవతలి నుంచి వచ్చే విమర్శల ధాటికి సమాధానం ఇవ్వలేం. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ లు. ఈ ఇద్దరిపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. దానికి కారణం ఇండియా-పాక్ మ్యాచ్ లో నో బాల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇండియా-పాక్ మ్యాచ్ లో నో బాల్ వివాదంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అంపైర్లపై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.”అంపైర్ భయ్యో ఈ రాత్రికి మీకు భోజనం పక్కా” అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సైతం టీమిండియాదే తప్పు అన్నట్లు ట్వీట్ చేశాడు. “థర్డ్ అంపైర్ ను అడగకుండా నో బాల్ ఎలా ఇచ్చారు. పైగా ఫ్రీ హిట్ బాల్ వికెట్లను తాకినా కూడా ఎలా మూడు పరుగులు తీశారు” అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే ఇప్పుడు అక్తర్ , ఆస్ట్రేలియాకు సంబంధించిన 17 ఏళ్ల క్రితం నాటి వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే? అది 2005 జనవరి 13 న పాకిస్థాన్-ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Umpire bhaiyo, food for thought aaj raat k liye 😉 pic.twitter.com/vafnDG0EVd
— Shoaib Akhtar (@shoaib100mph) October 23, 2022
ఈ మ్యాచ్ లో ఆసిస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్తర్ ఓ నో బాల్ వేస్తాడు. దాంతో ఓ ఫ్రీ హిట్ వచ్చింది, ఈ ఫ్రీ హిట్ బాల్ కూడా అక్తర్ నో బాల్ వేస్తాడు. అయితే మరో ఫ్రీ హిట్ బాల్ ను కూడా మునుపటి బాల్ లా ఆడే క్రమంలో వికెట్లు నేల కూలాయి. అయినప్పటికీ హాడిన్ పరుగులు తీశాడు. అప్పుడు అక్తర్ ఈ విషయమై అంపైర్లతో ఎటువంటి చర్చా జరపలేదు. దాంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ అక్తర్ ను తెగ ఆడేసుకుంటున్నారు.”అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏ” అని “అక్తర్ జీ మీకు అప్పటికింకా క్రికెట్ రూల్స్ తెలీదు కాబోలు.. అందుకే అంపైర్ తో వాగ్వాదానికి దిగలేదు” ముందు మీది మీరు కడుక్కోండి సాబ్ తర్వాత అవతలి వారి గురించి మాట్లాడొచ్చు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Glad to say no! https://t.co/GyHIcuNAYh
— Brad Hogg (@Brad_Hogg) October 25, 2022
Why was no ball not reviewed, then how can it not be a dead ball when Kohli was bowled on a free hit. #INDvPAK #T20worldcup22 pic.twitter.com/ZCti75oEbd
— Brad Hogg (@Brad_Hogg) October 23, 2022