నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ 2022 సంగ్రామం ముగిసింది. ఈ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా లాంటి జట్లు హాట్ ఫేవరేట్లుగా ఉన్నా.. ఇంగ్లీస్ టీమ్ సత్తా చాటి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి.. రెండో సారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడినా.. తర్వాత మంచి ప్రదర్శన కనబర్చి, కాస్త లక్ తోడవడంతో సెమీస్ చేరిన ఇంగ్లండ.. టీమిండియాపై సెమీస్‌లో భారీ విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్లో పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి.. వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ విజేతగా నిలువడంతో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు.
టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టిన సామ్.. ఫైనల్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు కూల్చి పాక్‌ను చావుదెబ్బకొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల పని సులువు చేస్తూ.. కేవలం 138 టార్గెట్ వచ్చేలా పాక్‌ను కట్టడి చేశాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022కి గాను సామ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుతో పాటు మరో అరుదైన రికార్డును కూడా సామ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా కింగ్ కోహ్లీ రికార్డు. 8 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆ రికార్డును తాజాగా సామ్ కర్రాన్ బద్దలు కొట్టాడు. అతి చిన్న వయసులో టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు పొందిన ఆటగాడిగా సామ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ అరుదైన రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ పేరిట ఉండేది.
టీ20 వరల్డ్ కప్ 2014లో అసాధారణ బ్యాటింగ్‌తో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఆ టోర్నీలో విరాట్ కోహ్లీ ఏకంగా 319 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. అప్పుడు కోహ్లీ వయసు 25 ఏళ్లు. దీంతో అతి పిన్న వయసులో టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ వరల్డ్ కప్ వరకు ఆ రికార్డు అలానే పదిలంగా ఉంది. కానీ.. 24 ఏళ్ల సామ్ కర్రాన్ ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టాడు. కాగా.. ఈ టోర్నీలోనూ విరాట్ కోహ్లీ 296 పరుగులతో వరల్డ్ కప్ 2022 టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే.
👌 Second-highest wicket-taker
🏅 Player of the Match in the final
💥 Career-best figures in the tournament
⭐ England’s most economical pacerPlayer of the Tournament Sam Curran stole the show in Australia 🤩 #T20WorldCup pic.twitter.com/tCCapBhV7U
— ICC (@ICC) November 14, 2022
Virat Kohli finished as the top run-scorer for a second time 🏅#T20WorldCup pic.twitter.com/6cxompA2Lw
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2022