టీ20 వరల్డ్ కప్ మినీ సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో పాక్ జట్టు 7 వికెట్లతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా సాగింది. దాంతో ప్రేక్షకులు నిరాశకు లోనైయ్యారు. కానీ ఈ మ్యాచ్ లో ఓ పాక్ అమ్మాయి మాత్రం సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తన ఫ్లయింగ్ కిస్ లతో టీవీల్లో మ్యాచ్ లను చూసే అభిమానులకు కిక్కెక్కించింది. పాక్-న్యూజిలాండ్ జట్లలో ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకున్న భారత అభిమానులకు కనుల పండగ దొరికింది. మ్యాచ్ ను కాస్తా పక్కకు పెట్టి పాక్ పిల్లపైకి తమ ఫోకస్ ను పెట్టారు అనడంలో సందేహం లేదు. దాంతో అందానికే అసూయ పుట్టించేలా ఉన్న ఈ అమ్మాయి గురించి నెట్లో వెతకడం స్టార్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
Who cares about Pakistan vs New Zealand 😜 #PAKvsNZ #NZvPAK #INDvsENG pic.twitter.com/jpeQsFs3FG
— Dk (@IAM_DALE05) November 9, 2022
పాక్-కివీస్ సెమీస్ మ్యాచ్.. గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్ నే చూస్తూ ఉన్నారు. కానీ టీవీల్లో మ్యాచ్ ను చూసే వారు మాత్రం ఆటను చూడటం లేదు. అదేంటి మరి ఇంకేం చూస్తున్నారు? అన్న అనుమానం రావొచ్చు. వారు మ్యాచ్ నైతే చూస్తున్నారు గానీ చూపులు మెుత్తం ఫ్లయింగ్ ముద్దులు పెడుతూ.. తమ జట్టులో జోష్ నింపుతున్న ఓ అమ్మాయి మీదే ఉన్నాయి. ఆ అందమైన సోయగం పేరు నటాషా నాజ్.. పాకిస్తాన్ పిల్ల.. పైగా విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ కూడా. ఆ విషయాన్ని తనే స్వయంగా తన ట్వీటర్ ఖాతాలో రాసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణ మాత్రం నటాషా అనే చెప్పక తప్పదు.
Divided by country United by beautiful girl but never with Pakistan GIRL😜😅😌#INDvsENG pic.twitter.com/S3b0CvFrkR
— Bang Bang 💫😎 (@RoonaVikranth) November 9, 2022
Come On India, Inshallah💚🇵🇰 pic.twitter.com/gxeZdU8EID
— Natasha 🇵🇰 (@NatashaOfficiaI) November 10, 2022
ఇక ఈ అమ్మడు ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద కనిపించినా ఒకటే అరుపులు, ఈలలు. అదీ కాక ఫ్లయింగ్ కిస్ లతో మ్యాచ్ కే మరింత అందాన్నితెచ్చింది నటాషా. ప్రస్తుతం నటాషాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన పిక్స్ ను షేర్ చేయడంతో.. భారత ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి థ్యాక్స్ చెప్పింది. మనం మళ్లీ ఫైనల్లో కలుద్దాం అంటూ రాసుకొచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో నటాషా నాజ్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందనడంలో సందేహం లేదు. నటాషా అందానికి ఫిదా అయిన టీమిండియా ఫ్యాన్స్ సరదా మీమ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
Thankyou Indian Fans 🙏Lets meet on sunday in Finals #INDvsPAK 🇵🇰💚 #INDvsENG Go India Win ✌️🇮🇳 pic.twitter.com/ZLhPMPpyKl
— Natasha Naaz 💚 (@SidmalhotraYT) November 10, 2022
Indian boys after seeing this girl:#PakvsNz pic.twitter.com/2JqOzb39aM
— Aryan🦥 (@iAryan_Sharma) November 9, 2022