టీమిండియా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచలో ఎక్కడ చూసినా ఇదే పేరు. ఈ టీమ్ గురించే చర్చ. ఇంక భారత అభిమానుల విషయానికి వస్తే.. ఒకరోజు ముందు నుంచే దీపావళి వేడుకలు మొదలు పెట్టేశారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ విజయంతో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ వంటి వారు వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో ఘనంగా విజయం నమోదు చేశాం. అయితే ఈ మ్యాచ్‌లో కూడా మనం ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాం. అదే అంతర్జాతీయ టీ20ల్లో 10 ఓవర్లలో అత్యంత తక్కువ స్కోర్‌ని నమోదు చేశాం. పాక్‌పై మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి కేవలం 45 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంటే కొన్నిసార్లు మ్యాచ్‌లలో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవును కానీ, ఇక్కడ ఒక ప్లేయర్ గురించి మాత్రం నెట్టింట తీవ్రంగా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అతను మరెవరో కాదు.. కేఎల్ రాహుల్. అవును ఎన్నో కీలక, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ ఎలా విఫలమయ్యాడో అంతా చూశారు. ఇప్పుడు పాక్‌పై కూడా మళ్లీ విఫలం కావడంతో.. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్‌ని ఉన్నపలంగా జట్టు నుంచి తొలగించాలంటూ టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అతని వల్ల జట్టుకు చాలా అన్యాయం జరుగుతోందని.. ఓపెనర్‌గా ఆడేందుకు అతడు అర్హుడు కాడంటూ కామెంట్ చేస్తున్నారు. పాక్‌పై మ్యాచ్‌లో కూడా ప్రతి బాల్‌ని ఎదుర్కొనేందుకు ఎంతో భయపడ్డాడని విమర్శిస్తున్నారు. 8 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి.. నసీమ్ షా బాల్‌లో బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు.
@BCCI @JayShah We need to understand why KL Rahul is being taken into the team despite so many failures . who is making money . This must be probed. @AmitShah . Now doubts will arise as to why Rahul is being taken despite very poor performance pic.twitter.com/4j3pXh9hEv
— H_WORLD (@H_WORLD9) October 24, 2022
కేఎల్ రాహుల్ ఆటతీరు మొత్తం టీమ్‌పై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే ఓపెనర్ ఇలాంటి బిగ్ గేమ్స్ లో తటపటాయిస్తూ ఆడితే తర్వాత వచ్చే వారిపై ఆ ప్రభావం ఉంటుందని, వాళ్లు ఆ ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అసలు కేఎల్ రాహుల్‌కి పదే పదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. శిఖర్ ధావన్‌కు అవకాశం కల్పించవచ్చు లేదా కేఎల్ రాహుల్ స్థానంలో పంత్‌కి అవకాశం కల్పించి అతడిని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే.. టీమిండియా మరింత మెరుగైన ప్రదర్శనలు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేఎల్ రాహుల్ విషయంలో సెలక్టర్స్ సరైన నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌కి తర్వాతి మ్యాచ్‌లో అయినా కేఎల్ రాహుల్ సమాధానం చెబుతాడేమో చూడాలి.
Kl rahul vs big teams and small teams drop kl rahul we are not going to win any worldcup if we have him in the team#klrahul #dropklrahul pic.twitter.com/3mOGYq1NhX
— mb for life (@mb_fan_dhfm) October 24, 2022
Meanwhile KL Rahul in every prominent game for India#INDvsPAK2022 #Cricket #WorldCup2022 #Kohli pic.twitter.com/yweSmj7QXg
— Pahadi panchi (@Rasbhaat) October 24, 2022
#klrahul it’s not accepteble😭 pic.twitter.com/No17PIokmQ
— Aakash mall (@Aakashmall10) October 24, 2022
KL Rahul checking when is match against
Netherlands, Zimbabwe and Bangladesh😁 pic.twitter.com/JjdfwpGe10— Sawan Jat (@SawanJat9) October 24, 2022
Once a KING always a KING❤
King kohli 💯#ViratKohligoat #GOAT𓃵 #Virat #viratkohli chase Master 😎
Congratulations to team india
| Chup bsdk Pakistanis😂|zim babar azam rizwan dhmaka | #PKMKBForever |#Ashwin | #klrahul #INDvsPAK2022#arshdeepsingh #ICCT20WorldCup2022#Cricket pic.twitter.com/2Lf8DSvYux— Sahil kumar (@sahilkumSahi) October 24, 2022
Shikhar Dhawan deserves to play World Cup ,Not KL Rahul #INDvsPAK #T20WorldCup #TeamIndia pic.twitter.com/D0w85ATyRe
— Amazing facts ® (@Currentaffa296) October 23, 2022