టీ20 వరల్డ్ కప్ 2022.. ఎంతో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు టోర్నీలోని గణాంకాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన తమ టీమ్ కు పొట్టి ప్రపంచ కప్ ను అందించాలని ప్రతీ ఆటగాడు శ్రమిస్తున్నాడు. అందరి ప్లేయర్స్ పోరాటం ఒకెత్తు అయితే నెదర్లాండ్స్ ఆటగాడు అయిన బస్ డీ లీడే పోరాటం మరోఎత్తు. గత మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన బౌన్సర్ వల్ల గాయపడ్డాడు లీడే. కంటి కింద గాయం అవ్వడంతో దానికి నాలుగు కుట్లు సైతం పడ్డాయి. దాంతో అందరు అతడు నెక్ట్స్ మ్యాచ్ ఆడడు అని ఫిక్స్ అయ్యారు. కానీ జింబాబ్వేతో కీలక మ్యాచ్ కావడంతో తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా పచ్చి కుట్లతోనే బరిలోకి దిగాడు. కీలకమైన 2 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్.. పాక్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ విసిరిన బౌన్సర్ సరాసరి వచ్చి నెదర్లాండ్స్ బ్యాటర్ బస్ డీ లీడే హెల్మెంట్ కు బలంగా తాకింది. దాంతో లీడే కంటి కింద బలమైన గాయం అయ్యింది. రక్తం సైతం కారడంతో ఫిజియో వచ్చి అతడిని పరీక్షించి మైదానం బయటకి తీసుకెళ్లాడు. దాంతో అతడు నెక్ట్స్ మ్యాచ్ కు దూరం అవుతాడు అని అందరు అనుకున్నారు. కానీ జరుగుతుంది.. మినీ సంగ్రామం. దాంతో జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యం అని గాయాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగాడు లీడే. బరిలోకి దిగడమే కాకుండా 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఒక విధంగా ఈ మ్యాచ్ ను లీడే గెలిపించాడనే చెప్పొచ్చు. ఎందుకంటే.. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 40 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న సికిందర్ రజాను అవుట్ చేసింది లీడేనే. రజాను అవుట్ చేయకపోతే జింబాబ్వే భారీ స్కోరు సాధించి ఉండేదే.
Bas de Leede playing with stitches today 🤕
Commitment 💯#T20WorldCup pic.twitter.com/sa2MALXk6Y— CricTracker (@Cricketracker) November 2, 2022
లీడే.. అటు బ్యాటింగ్ లోనూ 12 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. బస్ డే లీడే పోరాట స్ఫూర్తిని పలువురు క్రీడానిపుణులు ప్రశంసిస్తున్నారు. బాధను సైతం లెక్కచేయకుండా కీలక సమయంలో జట్టుకు అండగా నిలిచిన లీడే ఈ తరం క్రికెటర్లకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా 40 పరుగులు, విలియమ్స్ 28 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీక్రెన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ లో లీడే పోరాటమే అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో పలువురు నెటిజన్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Ouch 🤕 Bas de Leede has concussion after being hit in the grille by a Haris Rauf short ball – Logan van Beek has been approved as his substitute#NEDvPAK pic.twitter.com/mrkAohJw26
— Happy Chaudhary (@happykhus) October 30, 2022
Brandon Glover and Bas de Leede shared four wickets between them against Zimbabwe.#CricTracker #BrandonGlover #BasdeLeede #ZIMvNED #T20WorldCup pic.twitter.com/okEoId9CHr
— CricTracker (@Cricketracker) November 2, 2022