ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ స్పీడ్‌స్టర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్ నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అద్భుతమైన పేస్, స్వింగ్ బౌలింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాషువా లిటిల్ ఈ హ్యాట్రిక్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో జాషువా మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌లో జాషువా తన బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రెండో బంతికి హాఫ్ సెంచరీ చేసి మంచి జోరు మీదున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేసిన లిటిల్.. తర్వాత రెండు బంతుల్లో జెమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. అయితే.. లిటిల్ అవుట్ చేసిన ముగ్గురు కూడా చాలా మంచి బ్యాటర్లే కావడం విశేషం. చివర్లో టెయిలెండర్లను అవుట్ చేసి కొంతమంది బౌలర్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకుంటారు. కానీ.. ముగ్గురికి ముగ్గురి టాప్ క్లాస్ బ్యాటర్లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించడం నిజంగా గొప్ప విషయమే. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు 61 పరుగులతో రాణించాడు.
Joshua Little picks up a HAT-TRICK! 😮 #T20WorldCup #AsliKhelToAbHoga #Super12 #IREvsNZ #TenSportsHD pic.twitter.com/hFA3XzWhx8
— TenSports Pakistan (@TenPakistan) November 4, 2022