విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ప్రస్తుతం టీమిండియాలో అంతటి స్టార్‌డమ్ ఉన్న క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. తన 360 డిగ్రీ ఆటతో అనతికాలంలోనే బిగ్ ప్లేయర్‌గా మారిపోయిన సూర్య.. ప్రస్తుతం టీమిండియాలో కీ ప్లేయర్‌గా ఎదిగాడు. మిడిల్డార్‌లో జట్టుకు అతడే వెన్నుముక. టీ20ల్లో సూర్య విధ్వంసానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మనం ముద్దుగా పలుచుకునే కేన్ మామ సైతం ఉలిక్కిపడ్డాడు. సూర్య ఆడే షాట్లు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పాడంటేనే అర్థం సూర్య సత్తా ఏంటో. సౌతాఫ్రికా విధ్వంసకర మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్టైల్లో 360 ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడు తనే ఫైర్ బ్రాండ్.
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడి వెలుగులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌కు ఆడి స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ల్లో అదరగొడుతున్నా.. సూర్యకు జాతీయ జట్టు నుంచి వెంటనే పిలుపురాలేదు. నిజానికి సూర్యకు టీమిండియాలో ఆడే అవకాశం చాలా ఆలస్యంగానే వచ్చిందనే చెప్పాలి. కానీ.. లేటుగా వచ్చి.. లేటెస్టుగా వాయిస్తున్నాడు. ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన సూర్య.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్మురేపాడు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సెంచరీతో న్యూజిలాండ్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. టీ20ల్లో తన రెండో సెంచరీ నమోదు చేశాడు.
సూర్య ధాటికి టీమిండియా ఆ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. టీ20ల్లో తిరుగులేకుండా సాగిపోతున్న సూర్య వన్డేల్లోనూ సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తోనే మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సూర్య.. తొలి వన్డేలో నిరాశపర్చినా.. రెండో వన్డేలో రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే.. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పలు ఆసక్తికరమైన విషయాలపై స్పందించాడు. రెండో వన్డేలకు ముందు మీడియాతో మాట్లాడిన సూర్య.. టీమిండియా కెప్టెన్ రోహిత్ వర్మ నుంచి ఏదైన దొంగిలించాల్సి వస్తే.. ఏం దొంగలిస్తావ్ అని ఎదురైన ప్రశ్నకే సూర్య బదులిస్తూ.. రోహిత్ శర్మ పుల్ షాట్‌ను తీసుకుంటానని అన్నాడు. ఇప్పటికే ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు లేనన్ని షాట్లు కలిగి ఉన్న సూర్య.. రోహిత్ శర్మ పుల్ షాట్‌పై మాత్రం మనసు పారేసుకున్నాడు. అయితే.. రోహిత్ శర్మ పుల్‌షాట్‌ను ఎంత అద్భుతంగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుల్‌షాట్ రోహిత్‌కు అత్యంత ఫేవరేట్ షాట్ అని క్రికెట్ అభిమానులందరికీ తెలుసు.
Question (On ESPN Cricinfo): If you could steal one shot from any batsman, what would it be?
Suryakumar Yadav said,”Pull shot from the Rohit Sharma”. pic.twitter.com/n2MgSbtNGT
— Vishal. (@SPORTYVISHAL) November 26, 2022