ఐపీఎల్ తరహాలోనే టీ20 లీగ్ ఒకటి సౌతాఫ్రికాలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్ల ఫ్రాంచైజ్‌ను కూడా భారత కంపెనీలే దక్కించుకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఫ్రాంచైజ్‌లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ యజమానులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అక్కడి తమ జట్టుకు ఎంఐ కేప్‌టౌన్ అనే పేరు పెట్టింది.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే తమ జట్టు పేరును ప్రకటించింది. ‘సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్’ అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియాలో ఖాతా ద్వారా వెల్లడించింది. అలాగే సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడెన్ మార్క్రమ్ను జట్టులోకి తీసుకుంది. 27ఏళ్ల మార్కరమ్ ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అతను 14 మ్యాచ్‌ల్లో 381పరుగులు చేసి రాణించాడు. మరి సౌతాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ పేరు ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The first two Risers of #SunrisersEasternCape 🧡#OrangeArmy #SEC https://t.co/DY9VhU1AiQ
— SunRisers Hyderabad (@SunRisers) August 17, 2022