బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ కి పని చేప్పాడు. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్మిత్.. కోహ్లీ మధ్య ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ కి పని చేప్పాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత అర్ధ సెంచరీతో కదం తొక్కి జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన తొలి మూడు టెస్టుల్లో కోహ్లీ పరుగులు సాధించడంలో విఫలం అయ్యాడు. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్ లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడంతో కోహ్లీ సెలబ్రేషన్ ఇప్పుడు అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్.. కోహ్లీ బ్యాట్ చెక్ చేయడం కాస్త సరదాగా అనిపించింది.
ఆసిస్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ లో భారత బ్యాటర్లు తమ మునుపటి ఫామ్ ను అందుకున్నట్లే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. పుజారా అవుట్ అయిన తర్వాత జడేజాతో కలిసి కోహ్లీ.. భారత ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 87 ఓవర్ తర్వాత డ్రింక్స్ విరామం లభించడంతో.. విరాట్ కోహ్లీ డ్రింక్స్ తాగుతున్నాడు. ఈ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. కోహ్లీ దగ్గరకి వచ్చి సందడి చేశాడు. కోహ్లీతో సరదాగా మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాట్ ని తీసుకొని చెక్ చేస్తూ కనిపించాడు.
అయితే కోహ్లీ ఏకాగ్రతను చెడగొట్టడానికి స్మిత్ ఇలా చేశాడా ? లేకపోతే సరదాగా ఇలా చేశాడా? అనే విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలా సరదాగా మాట్లాడుకోవడం అభిమానులకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడురోజుల ఆటముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. జట్టులో శుభ్ మన్ గిల్(128) అద్భుత శతకంతో చెలరేగాడు. మిగతావారిలో కెప్టెన్ రోహిత్(35), పుజరా(42), విరాట్ కోహ్లీ(59*), జడేజా(16*) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఆడుతున్న ఆటతీరును బట్టి చూస్తే.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు క్రికెట్ పండితులు.
Steve Smith checking the Virat Kohli’s bat during the drinks break. pic.twitter.com/6joHugyg5G
— CricketMAN2 (@ImTanujSingh) March 11, 2023