Sri Lanka, World Cup 2023: క్రికెట్ చరిత్రలో పసికూన అనే ట్యాగ్‌ను వేగంగా వదిలించుకున్న జట్టు ఏదైనా ఉందంటే అది శ్రీలంకనే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లంక పెద్దగా ఎదిగింది. అయితే.. ప్రస్తుతం పురోగమనంలో లంక క్రికెట్ సాగుతోంది. అందుకే ఇదే సాక్ష్యం..
శ్రీలంక 27 ఏళ్ల క్రితమే వరల్డ్ కప్ సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2007, 2011 వరల్డ్ కప్స్‌లో ఫైనల్ ఆడింది. 2003లో సెమీస్, 2015లో కార్వర్ట్ ఫైనల్ వరకు చేరింది. ఇలా గత మూడు దశాబ్దాలుగా పెద్ద టీమ్‌గా ఉన్న శ్రీలంక.. ఇప్పుడు దారుణ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎంత దయనీయ స్థితికి దిగజారిందంటే.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడుతుందో? లేదో? తెలియని పరిస్థితి. వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు.. డైరెక్ట్‌గా క్వాలిఫై అవుతాయి. వాటిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్ ఇప్పటికే డైరెక్ట్‌గా క్వాలిఫై అయిపోయాయి. వెస్టిండీస్ సైతం క్వాలిఫై కానుంది. మొత్తం 13 జట్టులో టాప్ 8 టీమ్స్ క్వాలిఫై కాగా.. చివరి 5 స్థానాల్లో నిలిచన జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన జట్లు మాత్రం తిరిగి వన్డే వరల్డ్ కప్‌లో ఆడతాయి.
అయితే.. క్వాలిఫైయర్స్ ఆడాల్సిన ఐదు జట్లలో శ్రీలంక కూడా ఉంది. శ్రీలంక, సౌతాఫ్రికా, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో పాటు సీడబ్ల్యూసీ లీగ్ 2లో టాప్‌లో నిలిచిన మూడు జట్లు, సీడబ్ల్యూసీ క్వాలిఫైయర్ ప్లే ఆఫ్స్‌లో టాప్ 2లో నిలిచిన జట్లు ఆడతాయి. మొత్తం 10 టీమ్స్ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలో పాల్గొంటాయి. ఈ 10 జట్ల నుంచి కేవలం 2 జట్లు మాత్రమే వన్డే వరల్డ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో డైరెక్ట్‌గా క్వాలిఫై అయిన 8 జట్లు(హోస్ట్ కంట్రీగా ఉన్న ఇండియాతో కలుపుకుని), క్వాలిఫై అయిన రెండు జట్లు మొత్తం 10 జట్లు వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పోటీ పడతాయి. చాలా కాలంగా టాప్ 8 టీమ్స్‌లో ఒకటిగా నిలిచిన శ్రీలంక.. 1975లో తొలి వరల్డ్ కప్ ఆడింది.
1996 వన్డే వరల్డ్ కప్ గెలిచిన విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఈ తర్వాత కూడా వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే.. 1979లో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు శ్రీలంక క్వాలిఫైయర్స్ ఆడాల్సి వచ్చింది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు క్వాలిఫైయర్స్‌లో ఆడాల్సి పరిస్థితి తెచ్చుకుంది. క్వాలిఫైయర్స్‌లో గెలిస్తే..ఓకే. లేదా శ్రీలంకను 2023 వన్డే వరల్డ్ కప్‌లో చూడలేం. ఇది శ్రీలంక క్రికెట్‌కు ఘోర అవమానమే. ఒకసారి వరల్డ్ కప్ గెలిచిన జట్టు మళ్లీ క్వాలిఫైయర్స్ ఆడి.. అక్కడ నిరూపించుకుని వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకోవడమనేది.. ఆ జట్టు దయనీయ స్థితిని సూచిస్తోంది. మరి శ్రీలంక క్వాలిఫైయర్స్‌లో గెలిచి.. వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
With a 2-0 ODI series defeat 🆚 New Zealand, Sri Lanka have failed to qualify directly for the 2023 World Cup.
They will now play the qualifiers in June.#WorldCup2023 #NZvSL #CricketTwitter pic.twitter.com/GnbvaOmf5n
— Sportskeeda (@Sportskeeda) March 31, 2023