ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో పోరాడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో మరొకరు కరోనా బారిన పడ్డారు. దాదా ముద్దుల కూతురు సనాకు కూడా కరోనా సోకింది. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం సనా ఐసోలేషన్‌లో చికిత్స పొందతుంది. అయితే గంగూలీ భార్య డోనాకు మాత్రం వైరస్ సోకలేదు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలింది. గతంలో గంగూలీ సోదరుడు కూడా కరోనా బారిన పడ్డాడు. డిసెంబర్‌లో గంగూలీ కరోనా బారిన పడడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో గంగూలీకి స్వల్ప లక్షణాలు కూడా ఉన్నాయి.
#SanaGanguly daughter of #SouravGanguly tests positive for #Covid19
— Zee News English (@ZeeNewsEnglish) January 5, 2022
ఆసుపత్రిలో గంగూలీకి “మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్” థెరపీని నిర్వహించారు. అనంతరం ఇంటికి తరలించి హోంక్వారంటైన్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దాదాకు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు సోకింది కరోనాలోని డెల్టా వేరియంట్ అని నిర్దారణ దీంతో దాదాకు మరిన్ని జాగ్రత్తలతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇలా గంగూలీ ఫ్యామిలీలో మరొకరు కరోనా బారిన పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కరోనాతో పోరాడుతూ కూడా.. ఇండియన్ క్రికెట్ గురించే ఆలోచన!