ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెట్‌ను నడిపిస్తున్నాడు. కెప్టెన్ టీమిండియాను ప్రపంచ క్రికెట్లో ఒక శక్తిమంతమైన జట్టుగా తీర్చిదిద్దిన దాదా.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్ చెప్పిన తర్వాత కొన్నేళ్లకు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. తనలోని నాయకత్వ లక్షణాలు, పాలన దక్షతతో బీసీసీఐ బాస్ ఇండియన్ క్రికెట్ మరో మెట్టు ఎక్కిస్తున్నాడు. కరోనా కాలంలో కూడా ఐపీఎల్‌ను సమర్థవంతంగా నిర్వహించి సూపర్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లకు ప్రేక్షకులను రప్పించి.. ప్రపంచంలో తొలిసారి పోస్ట్ కరోనా తర్వాత స్టేడియాన్ని ప్రేక్షకులతో నింపి శభాష్ అనిపించుకున్నాడు.
గంగూలీ ఒక గొప్ప క్రికెటర్‌తో పాటు అంతకంటే గొప్ప ఫ్యామిలీ మ్యాన్. ఆట, వృతితో పాటు కుటుంబానికి కూడా దాదా కావాల్సినంత ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా తన భార్య దోన గంగూలీతో కలిసి ఒక టీవీ ప్రొగ్రామ్‌లో దాదా డాన్స్ చేస్తూ అదరగొట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగాలీ పాటకు దాదా వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్రికెట్లోనే కాదు.. దాదా ఏ రంగంలోనైనా కింగే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.కాగా ఈ ప్రొగ్రమ్ ఎప్పటిది, ఎక్కడ జరిగింది అనే విషయంలో ఇంక క్లారిటీ లేదు. కానీ.. గంగూలీ దంపతులు వేసిన డాన్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. గంగూలీకి ఒక కూతురు కూడా ఉంది. ఇలా దాదా.. ఒక వైపు ఇండియన్ క్రికెట్‌ను నడిపిస్తూనే.. మరో వైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తే.. దాదా ఆల్ వేస్ గ్రేట్ అంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sourav Ganguly: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన సౌరవ్ గంగూలీ!