క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దాన్ని క్రికెట్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని సార్లు ఆటగాళ్ల మధ్య జరిగే గొడవలు, మాటలు శృతిమించుతూ ఉంటాయి. అలాగే నోరు అదుపులో పెట్టుకోకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఓ పాకిస్థాన్ క్రికెటర్ నోరు పారేసుకున్నాడు. 2015 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా విరాట్ కోహ్లీపై నోరు పారేసుకున్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. కోహ్లీతోనే గొడవ పెట్టుకున్నాడంటే.. అతనో పెద్ద సూపర్ స్టార్ క్రికెటర్ అనుకోకండి.. తిప్పి కొడితే.. 30 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడని ఓ అనామక క్రికెటర్. పాకిస్థాన్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అతను ఆడింది కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే.
2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత్ తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు సోహెల్ ఖాన్ కాస్త అతి చేశాడు. దీంతో కోహ్లీ అతని వద్దకు వెళ్లి ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చావ్.. ఎందుకు అంతలా నోరు పారేసుకుంటున్నావ్ చెప్పినట్లు సోహెల్ పేర్కొన్నాడు. కోహ్లీ నార్మల్‌గానే చెప్పినా.. సోహెల్ ఖాన్ దానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతూ..‘చూడు బిడ్డా.. నువ్వు అండర్ 19 ఆడుతున్నప్పుడే నీ బాప్ టెస్టు క్రికెట్ ఆడాడు’ అని చాలా పొగరుగా అహం ప్రదర్శిస్తూ చెప్పాడు. ఇక్కడ బాప్ అని తనను తాను చెప్పుకున్నాడు. పాకిస్థాన్ తరఫున 2008 సమయంలో సోహెల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. విరాట్ కోహ్లీ సైతం 2008లో తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు.
కానీ.. కోహ్లీని తక్కువగా అంచనా వేసిన సోహెల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెడుతూ.. ఆ రోజు కోహ్లీని అలా అన్నానని చెప్పుకున్నాడు. కానీ.. ఇప్పుడు మాత్రం కోహ్లీ అంటే గౌరవం అని అతను చాలా గొప్ప ఆటగాడిగా ఎదిగాడని ఖాన్ తెలిపాడు. సోహెల్ ఖాన్ కోహ్లీ గురించి చాలా తక్కువగా అంచనా వేసినట్లు ఉన్నాడు. నిజానికి కోహ్లీ కంటే ముందు సోహెల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. పెద్దగా పొడిచిందేం లేదు. తిప్పి కొడితే 27 మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. కోహ్లీ ఖాతాలో 74 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఇద్దరు చేసిన పరుగులు, ఆడిన మ్యాచ్‌లు పక్కపక్కన పెడితే.. ఎవరు బాప్ అనే విషయం తెలుస్తుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. సోహెల్ అప్పుడు నోరు పారేసుకున్న విషయాన్ని ఇప్పుడు సిగ్గులేకుండా బయటపెట్టుకున్నాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోహెల్ ఖాన్‌పై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s Sohail Khan explaining what happened between him and Virat Kohli in 2015 in Australia. pic.twitter.com/dc0N4Q0MCd
— Farid Khan (@_FaridKhan) February 2, 2023