‘స్మృతి మందాన..’ ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్‌లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే… స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోయే ఈ భామ.. తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిలిపి నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్ల మనసులు మనసులు కొల్లగొట్టింది. అలాంటి ముద్దుగుమ్మ ఉన్నట్టుండి.. ప్రైవేట్ ఫోటో పోస్ట్ చేసింది.
మహిళా క్రికెటర్లను ఎక్కువుగా క్రికెట్ జెర్సీలోనే చూస్తుంటాం. అంతకు లేదంటే.. సాంప్రదాయ దుస్తుల్లో కనివిందు చేస్తుంటారు. అంతేకానీ, వారి బోల్డ్ ఫోటోలు బయటకి రావడం చాలా అరుదు. అలాంటిది స్మృతి మందాన.. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ప్రైవేట్ ఫోటోను తానే పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడిన మందాన.. సేదతీరుతున్న సమయంలో ఫోటోలకు ఫోజులిచ్చింది. అందులో ఒకదానిని అభిమానుల కోసం పోస్ట్ చేసింది. ఇది చూడడానికి కాస్త బోల్డ్ గా ఉంది. ఈ ఫోటోపై భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తాము అభిమానించే క్రికెటర్ నుంచి ఇలాంటి పోస్టులు ఎక్సపెక్ట్ చేయలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, హీరోయిన్లను మించిన అందం ఇప్పుడు బయటపడిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
19 జూలై 1996లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన మంధాన, అండర్-15, అండర్-16, అండర్-19 క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. మందాన 16 ఏళ్ల వయసులోనే.. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసింది. ఈ ముద్దుగుమ్మ బ్యాట్ పట్టుకుందంటే పరుగుల వరద పారాల్సిందే. మాజీ దిగ్గజం సెహ్వాగ్ స్టయిల్ లో మెరుపులుంటాయి. డిసెంబర్ 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కావాల్సివుంది. ఈ సిరీస్ కు మందాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది.