ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022 అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేష్ కార్తీక్‌లకు విశ్రాంతి ఇవ్వడం.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్ వెళ్లింది. నేడు(శుక్రవారం) విల్లింగ్‌టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దు అయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలోపలే.. వాలీ-ఫుట్ బాల్ కలిపి సరదాగా ఆడుకుంటున్నారు. కూర్చీలను మధ్యలో పెట్టుకుని అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉండి ఆడుకుంటున్నారు.
మ్యాచ్ ఆలస్యం అవ్వడంతో ఆటగాళ్లు ఇలా సరదాగా గడుపుతుంటే.. మరో వైపు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా ఉన్న సైమన్ డౌల్ మాత్రం అదే స్టేడియంలో చైర్ క్లీనర్‌గా మారారు. ఈ సిరీస్‌లో కామెంటేటర్‌గా ఉన్న సైమన్.. మ్యాచ్ ఆరంభానికి ముందు కామెంట్రీ బాక్స్‌లోకి వెళ్లగా అక్కడంతా.. మురికి మురికిగా ఉండటంతో.. తానే స్వయంగా కుర్చీలను శుభ్రంగా తుడిచారు. తనతో పాటు కామెంట్రీ చేసేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు కూర్చునేందుకు సౌకర్యంగా తానే కూర్చీలను తుడిచారు. అయితే.. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ‘స్కై స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు మరో గొప్ప కారణం దొరికింది. మన విదేశీ గెస్టులు కూర్చునేందుకు ఇప్పుడే కామెంట్రీ బాక్స్‌లోని కుర్చీలను నేనే క్లీన్ చేశాను. ఈ ప్లేస్ ఇలా ఉన్నందుకు సిగ్గుగా ఉంది, ఇబ్బందిగా ఉంది’ అని ట్వీట్ చేశాడు.
అయితే.. విదేశీ కామెంటేటర్ల ముందు తమ దేశం పరువు పోవద్దని సైమన్ కుర్చీలను క్లీన్ చేయడం, అతిథులకు అసౌకర్యం కలగకుండా తానే స్వయంగా క్లీన్ చేయడంపై న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. అయితే.. విల్లింగ్‌టన్‌లోని స్కైస్టేడియంలో ఇలాంటి పరిస్థితులపై మాత్రం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఇలా పట్టించుకోకుండా ఉంటే ఎలా అని పేర్కొంటున్నారు. అయితే.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇండియన్ క్రికెటర్లకు సరైన భోజనం ఏర్పాటు చేయని సంఘటనను ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
@Sportsfreakconz @martindevlinnz Another great reason to play here at @skystadium . I have just cleaned all the seats in our commentary area so our overseas guests can sit down. What a shambles of a place. Embarrassing. #welcometoNZ pic.twitter.com/Xnpz5BihcI
— Simon Doull (@Sdoull) November 18, 2022