సానియా మీర్జా – షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నపేర్లు. దానికి కారణం వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నరన్న వార్తే. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి.. తాజాగా పాకిస్థాన్ మోడల్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు. ఈ పిక్స్ చూసిన వారంత నిజంగానే మోడల్ కు షోయబ్ మాలిక్ కు ఏదో సంబంధం ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. మెున్న సానియా మీర్జా కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను పెట్టింది. దాంతో వీరి విడాకులు ఖాయం అని అందరు అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
షోయబ్ మాలిక్ గతేడాది పాకిస్థాన్ మోడల్ ఆయేషా ఒమర్ తో కలిసి ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. స్థానిక మ్యాగజైన్ కోసం వీరిద్దరు కలిసి ఈ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. హెల్త్ అంట్ ఫిట్ నెస్ పై అవగాహనలో భాగంగా ఈ షూట్ జరిగింది. ఈ షూట్ లో పాక్ మోడల్ బోల్డ్ గానే నటించింది. స్విమ్మింగ్ ఫూల్, జిమ్ లో చేసిన ఫొటో షూట్ పిక్స్ ను.. తాజాగా ఆయేషా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. సానియా విడాకులకు అంటూ వస్తున్న వార్తకు ఈ పిక్స్ తోడయ్యాయి. దాంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Have Sania Mirza and Shoaib Malik separated?
Is Pakistani model #AyeshaOmar the reason behind #ShoaibMalik and #SaniaMirza‘s divorce?#kashmir #T20WorldCup2022 #JummahMubarak #NationalEducationDay #NawazSharif #SaniaMirza #SaniaMirzadivorce #ShoaibMalik #PAKvsEng #Byebyeindia pic.twitter.com/evpsNBYOeV
— Aleeza Wani (@AleezaWani2) November 11, 2022
ఇక ఫొటో షూట్ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ..” ఈ ఫొటో షూట్ చూసి సానియా మీర్జా ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న ప్రశ్నకు మాలిక్ సమాధానం ఇస్తూ..” మీ భర్త ఇలాంటి వీడియోలు చేస్తే మీ రియాక్షన్ ఏంటి? అని ఎదురు ప్రశ్నించాడు. వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే సమాధానం చెప్పేవాడుగా అని మరికొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటో షూట్ జరిగినప్పటి నుంచే సానియా-మాలిక్ ల మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయని అంటున్నారు. ఇన్ని పుకార్లు వస్తున్నప్పటికి అటు మాలిక్.. ఇటు సానియాలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Not just the photoshoot, he has been having a roaring ‘kuchikoo’ love affair with @TheAyeshaOmar #SaniaMirza pic.twitter.com/K4oc7ZZ0q7
— AwesomeMughals (@AwesomeMughals) November 11, 2022