మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా బురఖాలో దర్శనమిచ్చింది. రంజాన్ నెల ప్రారంభమైన సందర్భంగా ఆమె కుటుంబంతో కలిసి సౌదీలోని మదీనా వెళ్ళింది.
ఇటీవలే ఆటకు వీడ్కోలు చెప్పిన మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా ఆమె బురఖాలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పండుగ ముందు చాలా మంది ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తాజాగా సానియా మీర్జా కూడా కుటుంబ సమేతంగా సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్ళింది. సానియా మీర్జా, ఆమె కొడుకు ఇజ్హాన్ మీర్జా మాలిక్, తల్లిదండ్రులు ఇమ్రాన్ మీర్జా, నసీమా మీర్జా, ఆమె సోదరి ఆనం మీర్జా, బావ మొహమ్మద్ అసదుద్దీన్ మదీనా వెళ్లి ప్రార్థనలు చేశారు.
సానియా మీర్జా తన కొడుకు ఇజ్హాన్ మీర్జా చేయి పట్టుకుని దిగిన ఫోటో, తన చెల్లెలి కూతురుని ఎత్తుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. సానియా సోదరి సహా కుటుంబమంతా కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను అప్లోడ్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ఎక్కడా షోయబ్ మాలిక్ కనిపించకపోవడంతో.. ‘షోయబ్ మాలిక్ ఎక్కడ’ అంటూ సానియా మీర్జాను అడుగుతున్నారు. దాదాపు చాలా మంది నెటిజన్స్ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. సానియా టెన్నిస్ ప్లేయర్ అయినప్పటికీ బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలతో స్నేహం చేస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచులు ఆడింది. ఆ మ్యాచులు చూడడానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, ఫరా ఖాన్, ఏ.ఆర్. రెహ్మాన్, దుల్కర్ సల్మాన్, హుమా ఖురేషి తదితరులు వచ్చారు.
మ్యాచులు ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం సానియా ఓ ప్రైవేటు హోటల్ లో డిన్నర్ ఏర్పాటు చేసింది. ఆ డిన్నర్ కు పలువురు ప్రముఖులు వచ్చి రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో కూడా సానియా భర్త షోయబ్ మాలిక్ కనిపించలేదు. తాజాగా వెకేషన్ లో భాగంగా దిగిన ఫోటోల్లో కూడా షోయబ్ లేకపోవడంతో నెటిజన్స్ ఎక్కడ షోయబ్ అని అడుగుతున్నారు. అయితే గత ఏడాది నుంచి సానియా, షోయబ్ లు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సానియాతో షోయబ్ లేకపోవడానికి ఇదే కారణమేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.