హీరోయిన్ శ్రియ మరోసారి రచ్చ చేస్తోంది. రోజురోజుకీ టీనేజ్ అమ్మాయిలా మారిపోతూ కాకరేపుతోంది. అందాలని ఏ మాత్రం దాచకుండా చూపిస్తూ హీట్ పెంచేస్తోంది. మరి శ్రియ లేటెస్ట్ ఫొటోల సంగతేంటి?
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు హీరోయిన్లకు గ్లామర్ చాలా ముఖ్యం. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే ఆ మాత్రం వయ్యారాలు చూపించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్నా సరే హీరోయిన్లు సూపర్ ఫిజిక్ కోసం తెగ కష్టపడుతుంటారు. బాలీవుడ్ భామలు అయితే ఈ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. అందుకే ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పడుకొణె, కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా సరే గ్లామర్ తో రెచ్చగొట్టేస్తుంటారు. యోగా, వర్కౌట్స్, డైట్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తున్న శ్రియ అయితే రోజురోజుకీ పడుచు పిల్లలా మారుతోంది. హాట్ ఫొటలతో కాకరేపుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రియ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం, యాక్టింగ్ తో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోలతో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో లాక్ డౌన్ టైంలో పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం 40 ఏళ్ల శ్రియ ఓ పాపకు తల్లి కూడా అయిపోయింది. కానీ తన అందంతో హీటెక్కించే పనిలో పడింది. తాజాగా ఇన్ స్టాలో శ్రియ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే అందరికీ అదే అనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల బార్బీ డాల్ లా కనిపిస్తుంది మరి.
టాప్ టూ బాటమ్ వరకు మొత్తం కవర్ చేసిన ఈ డ్రెస్సులో.. కాస్తలో కాస్త ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తోంది. పెద్దగా గ్లామర్ డోస్ ఇవ్వకపోయినప్పటికీ తన ఫిజిక్ తో వావ్ అనిపిస్తోంది. ఈ వయసులోనూ శ్రియ గ్లామర్ ని ఈ రేంజులో మెంటైన్ చేయడం చూసి అందరూ మెంటలెక్కిపోతున్నారు. గతంలోనూ చాలాసార్లు తన ఒంపుసొంపుల్ని ఒలకబోసిన శ్రియ.. ఇప్పటికే అదే హాట్ నెస్ తో ఉండటం చాలామందిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్యే ‘కబ్జ’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. సరేలే అదంతా వదిలేస్తే.. శ్రియ తాజా ఫొటోలు చూసిన వెంటనే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.