అమ్మ, అమ్మమ్మ, అత్త, కోడలు ఈ నలుగురూ ప్రెగ్నెంట్లు అయ్యారంటే నమ్ముతారా? కలిసి ఫోటో షూట్ కూడా దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకేసారి అమ్మ, అమ్మమ్మ, అత్త, కోడలు ప్రెగ్నెంట్ అవ్వడం ఎక్కడైనా సాధ్యమేనా? ఒకేసారి అంటే ఒకే తేదీన, ఒకే సమయాన అని కాదు. అటూ ఇటూ తేడాలో ఒకే ఏడాదిలో అయినా సరే మూడు తరాలకు చెందిన మహిళలు గర్భవతులు అవ్వడం అనేది అసాధ్యం. కానీ ఈ ఫోటో చూస్తే మహిళ తల్లి, అమ్మమ్మ, అత్త గార్లు కూడా గర్భవతులుగా కనబడుతున్నారు. ఈ వయసులో గర్భం దాల్చడం ఏంటి అని అనిపిస్తుంది కదూ. మరదే మ్యాజిక్కు. ఈ గర్భ ఘట్టాన్ని ఫోటో షూట్ చేసి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ఈరోజుల్లో వేడుక ఏదైనా ఫోటో షూట్ లు సర్వసాధారణమైపోయాయి. పుట్టినరోజు అని, పెళ్లి అని, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అని, ప్రెగ్నెన్సీ అని ఇలా రకరకాల ఫోటో షూట్ లు చేస్తున్నారు.
ఫోటో షూట్స్ కోసం సరికొత్త స్టిల్స్ దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆనందిస్తున్నారు. తాజాగా ఒక ఫోటో షూట్ నెటిజన్స్ ని బాగా ఆకర్షిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు వయసున్న మహిళలు గర్భవతులుగా ఫోటో షూట్ దిగారు. ఒక 30 ఏళ్ల వయసు ఉండే మహిళ, ఆ మహిళ అమ్మ, అమ్మమ్మ, అత్తలు కూడా గర్భవతులుగా కనిపిస్తున్నారు. అయితే ఇది నిజంగా నిజమేనా? ఇది సాధ్యమేనా? అంటే కాదు. ఆ ఫోటోలో ఒక మహిళ మాత్రమే గర్భవతి. అందరి కంటే వయసులో చిన్నగా ఉన్న మహిళ మాత్రమే గర్భవతి, మిగతా ముగ్గురు మహిళలు గర్భవతులుగా నటించారు. అంటే లోపల తలగడ పెట్టుకుని ప్రెగ్నెన్సీ వచ్చినట్టు కటింగ్ ఇచ్చారు. జిబిన్ అనే ఫోటోగ్రాఫర్ భార్య చింజు ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసి కొత్తగా ఫోటో షూట్ చేయాలని అనుకున్నాడు.
వెరైటీగా ఉంటుందని ఇంట్లో ఉన్న మహిళలతో తన భార్యను కలిపి ప్రెగ్నెంట్లుగా ఉన్నట్టు ఫోటో తీస్తే బాగుంటుందని అనుకున్నాడు. తన ఆలోచనను భార్యకు, భార్య కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు అంగీకరించడంతో తన తల్లికి, భార్య అమ్మ, అమ్మమ్మలకు తలగడలు ఇచ్చి ప్రెగ్నెంట్ గెటప్ వేయించాడు. అంతేనా వారి వారి భర్తలతో నిజంగా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త ఎలా అయితే అనుభూతి చెందుతాడో అలానే హావభావాలు పెట్టించి ఫోటోలు క్లిక్ మనిపించాడు జిబిన్. ఈ ఫోటోలు చూస్తుంటే నిజమేనేమో అని అనుకునేలా ఉన్నాయి స్టిల్స్. ఒకే ఫ్రేములో నాలుగు జంటలు ఇలా ప్రెగ్నెంట్ మూడ్ ని మెయింటెయిన్ చేయడం అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షించింది. ఇది నిజం కాదని తెలిసినా గానీ చూడడానికి బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.