అందరిలా హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆమె మాత్రం విడాకుల్ని అంతకంటే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇదెక్కడి ట్రెండ్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
మీరు ఇప్పటివరకు ఎన్నో ఫొటోషూట్స్ చూసుంటారు. కానీ ఇది వేరే లెవల్. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్, పెళ్లి, ప్రెగ్నెన్సీ, పుట్టిన బిడ్డకు ఫొటోలు తీసుకోవడం అనేది ఈ మధ్య చాలా సాధారణ విషయం అయిపోయింది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ తాజాగా విచిత్రమైన ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అదే విడాకుల ఫొటోషూట్. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఓ సెలబ్రిటీ తన విడాకుల్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా ఫొటోషూట్ చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో ‘ముల్లుం మరళుం’ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని. ‘సూపర్ మామ్’ రియాలిటీ షోలో పాల్గొని ఈమె చాలా ఫేమ్ తెచ్చుకుంది. కొన్నేళ్ల క్రితం రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు ప్రతిరూపంగా రియా అనే పాప కూడా పుట్టింది. సంసారం కొన్నాళ్లపాటు బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని నెలల క్రితం వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త, తనని మానసికంగా-శారీరకంగా వేధిస్తున్నాడని షాలిని.. విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. తాజాగా ఆమెకు డివోర్స్ వచ్చేశాయి. ఈ సందర్భంగా ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుని కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
‘పెళ్లితో ఇబ్బందులు పడుతూ మాట్లాడలేకపోతున్న మహిళలకు ఈ మెసేజ్. పెళ్లి బంధాన్ని వదులుకోవడం అనేది ఓకే. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీ జీవితాన్ని మీరు మాత్రమే కంట్రోల్ చేసుకోండి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురింతి ఆలోచించండి. విడాకుల అనేది పొరపాటు ఏం కాదు. మీ జీవితంలో ఇది ఓ టర్నింగ్ పాయింట్. పెళ్లిని వదిలేయాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటి వాళ్లకోసమే ఈ పోస్ట్’ అని నటి షాలిని కామెంట్ చేసింది. అయితే విడాకులని కూడా ఫొటోషూట్ చేసి, తీసుకోవడంపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో సదరు నటి తన మాజీ భర్త ఫొటోని కాలి కింద తొక్కుతూ, అడ్డంగా చింపేస్తూ పోజిల్చింది. మరి ఈ వింత, విడ్డూరమైన ఫొటోషూట్ పై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.