హీరోయిన్స్ అంటే అటు సినిమాల్లోనే కాదు.. ఇటు సోషల్ మీడియాల్లో కూడా చాలా హుషారుగా ఉంటారు. రోజూ రీల్స్- ఫొటో షూట్స్ అంటూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో అప్సరా రాణి కూడా ఒకరు. తన డైలీ యాక్టివిటీస్ నుంచి ఫొటోషూట్స్ వరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
ఇప్పుడు హీరోయిన్స్ వెండితెరపై కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేస్తున్నారు. అందరూ ఫొటోషూట్స్, రీల్స్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఒక్క హీరోయిన్స్ మాత్రమే కాదు.. వెండితెరపై మెరిసే ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోనే అలరిస్తున్నారు. ఇంక అప్సరా రాణి లాంటి అమ్మడుకి అయితే నెట్టింట ఆదరణకు ఏమాత్రం కరువు లేదు. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే కాకుండా తన డైలీ యాక్టివిటీస్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే ఇన్ స్టాగ్రామ్ లో కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే.
అప్సరా రాణి అనే కంటే కూడా ఆర్జీవీ హీరోయిన్ అంటే బాగా గుర్తు పడతారు. స్పెషల్స్ సాంగ్స్ తో ఈ భామ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. భూమ్ బద్ధల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలని ఆ సాంగ్ షేక్ చేసింది. తెలుగు ప్రేక్షకుల్లో అయితే ఆమె క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ముఖ్యంగా ఆర్జీవీ ఆమెను పరిచయం చేయడం కూడా బాగా కలిసొచ్చింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్సరా రాణి పెట్టే ఫొటోస్ కి రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇస్తూ, షేర్ చేస్తుంటారు. తాజాగా అప్సరా రాణి షేర్ చేసిన ఒక ఫొటో షూట్ బాగా వైరల్ గా మారింది.
సాధారణంగా అప్సరా రాణి ఏ ఫొటో షేర్ చేసినా అది వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. ఈ ఫొటో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదేంటంటే.. ఆమె ఒక వైట్ కలర్ ఫర్ సూట్ వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే అది బాత్ టవల్ ని పోలి ఉండటంతో.. అందరూ బాత్ రూమ్ నుంచి నేరుగా కెమెరా ముందుకు వచ్చేశావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అది ఒక ఫర్ బ్లేజర్ అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. బాత్ టవల్ అనే అనుకుంటున్నారు. ఇంక అప్సరా రాణి కెరీర్ విషయానికి వస్తే.. స్పెషల్ సాంగ్స్ తో సినిమాల్లో.. ఫొటో షూట్లలో ఇన్ స్టాగ్రామ్ అప్సరా రాణి దూసుకుపోతోంది.