టీమిండియా-న్యూజిలాండ్ తొలి వన్డే థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన మన జట్టు 349/8 పరుగుల భారీ స్కోరు చేసేసరికి మనమే పక్క గెలుస్తామని అందరూ అనుకున్నారు. దానికి తోడు కివీస్ కూడా ఓ దశలో ఓడిపోతుందేమోనని అనుకున్నారు. అలాంటి టైంలో ఆల్ రౌండర్ బ్రాస్ వెల్ అద్భుతం చేశాడు. మ్యాచుని గెలిపించినంత పనిచేశాడు. కానీ చివర్లో ఔటైపోవడం వల్ల టీమిండియా మ్యాచు గెలిచింది. దీంతో క్రికెటర్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోహ్లీ ఇచ్చిన ఐడియానే ఈ విజయానికి కారణమని తెలుస్తోంది.
ఇక విషయానికొస్తే.. హైదరాబాద్ వేదికగా తాజాగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ జట్టుకు విధించింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించేసరికి.. న్యూజిలాండ్ 131/6 తో ఓ దశలో ఓడిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. ఈ దశలో మైకేల్ బ్రాస్ వెల్ (78 బంతుల్లో 140), శాంట్నర్ (45 బంతుల్లో 57) ఏడో వికెట్ ఏకంగా 162 పరుగులు జోడించారు. బౌలర్ తో సంబంధం లేకుండా బ్యాటింగ్ తో చితక్కొట్టిన బ్రాస్ వెల్.. మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. చివరి ఓవర్ లో కివీస్ విజయానికి 20 పరుగులు అవసరం. ఓ వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఇలాంటి టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ బాధ్యతని శార్దుల్ ఠాకూర్ కు అప్పగించాడు.
ఇక చివరి ఓవర్ తొలి బంతికే సిక్స్ బాదిన బ్రాస్ వెల్.. కివీస్ జట్టు గెలిపించేలా కనిపించాడు. తర్వాత బంతికి వైడ్ వేసిన శార్దుల్.. మరుసటి బంతికి యార్కర్ వేసి బ్రాస్ వెల్ ని ఎల్బీడబ్ల్యూ చేశాడు. అతడి రివ్యూ కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మన జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే యార్కర్ వేస్తే బ్రాస్ వెల్ ఔట్ అవుతాడని శార్దుల్ కు కోహ్లీనే ఐడియా ఇచ్చాడు. దాన్ని తూచ తప్పకుండా అమలు చేసిన అతడు సక్సెస్ అయ్యాడు. ఓడిపోయిందనుకున్న మ్యాచ్ ని గెలిపించాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ తర్వాత బయటపెట్టాడు. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. జట్టులో సీనియర్స్ ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అని అంటున్నారు. కోహ్లీ వల్లే టీమిండియా విజయం సాధించిందని మాట్లాడుకుంటున్నారు. మరి శార్దుల్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
You can’t Hit Against Lord Shardul #IndVsNz #ShardulTHAKUR #lordShardul #Mitchell #INDvNZpic.twitter.com/bx8viaGot7
— S. (@SohitPathak_18) January 18, 2023