క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మరెంతో దూరంలో లేదు. మరో మూడు రోజుల్లో ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ నెల 28న యూఏఈలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరుదేశాల ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఎవరి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో అని చాలా రోజులుగా చాలా మంది క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మ్యాచ్ ప్రెడిక్షన్లు కూడా భారీగా వెల్లడవుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది భారత్ హాట్ ఫేవరేట్ అని చెప్పగా.. మరికొంతమంది పాకిస్థాన్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం భారత్‌కు చెందిన వాళ్లు భారత్, పాకిస్థాన్‌కు చెందిన వారు పాకిస్థాన్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అందులో తప్పులేదు.. ఏ దేశం వారికి వారి దేశం గెలుస్తుందనే ధీమా ఉండటం సహజం. కానీ.. క్రికెటర్లుగా తమకున్న పరిజ్ఞానంతో కొంతమంది ఇరుజట్ల బలాబలాలను అంచనా వేసి.. ఫలనా జట్టును విజయం వరించే అవకాశం ఉందని చెబుతారు.
ప్రస్తుతం భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అలాంటి కొన్ని నిష్పక్షపాత ప్రెడిక్షన్లు కూడా వచ్చాయి. కానీ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మాత్రం భారత్-పాక్ మ్యాచ్‌పై ఎవరూ ఊహించని విధంగా స్పందించాడు. సాధారణంగా అఫ్రిదీ గురించి తెలిసినవాళ్లు కచ్చితంగా పాకిస్థాన్ గెలుస్తుందని గుడ్డిగా చెప్పేసి ఉంటాడని అనుకుంటారు. ఎందుకంటే అఫ్రిదీ కెరీర్ మొత్తం ఏదో ఒక విషయంలో టీమిండియాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈ సారి కూడా భారత్‌పై పాకిస్థాన్ బంపర్ విక్టరీ సాధిస్తుందని, టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోతుందని అఫ్రిదీ చెప్పి ఉంటాడనుకుంటే పొరపాటే. ఈ సారి అఫ్రిదీ ఒక పెద్దమనిషిలా మాట్లాడాడు.
ఆసియా కప్‌లో 28న జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని ఓ అభిమాని అఫ్రిదీని సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. ‘ఎవరైతే తక్కువగా తప్పులు చేస్తారో.. వారే గెలుస్తారు’ అని సమాధానం ఇచ్చాడు. అఫ్రిదీ నుంచి ఇలాంటి స్పందనను రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. భారత్‌పై అక్కసుతో గుడ్డిగా పాకిస్థాన్ గెలుస్తుంది, బాబర్ అజమ్ చింపేస్తాడు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకుండా.. ఇరు జట్లు సమాన బలాబలాలు కలిగి ఉన్నాయి.. మ్యాచ్ టైమ్‌లో ఎవరైతే తక్కువ తప్పులు చేసి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వరో వారే గెలుస్తారనే అర్థం వచ్చేలా పరిణితి చెందిన వ్యక్తిలా జవాబిచ్చాడు. దీంతో ప్రస్తుతం అఫ్రిదీ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్వీట్‌ను ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎవడ్రా పుజారా టెస్టు ప్లేయర్ అన్నది..? 20 ఫోర్లు, 2 సిక్సులతో విధ్వంసం
Which is the stronger team in Pakistan Vs India match and who do you think will win?#AskLala
— Duaa 🕊️ (@Duaa_0o) August 21, 2022