రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్' అందరికీ సుపరిచితుడే. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అక్తరంటే భయపడని బ్యాటర్ లేరు. 'భయపడలేదు' అని చెప్పటానికి ఒకటి.. రెండు రికార్డులు ఉన్న అతడి రాకాసి బౌన్సర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాటర్ ఏదో ఒక క్షణంలో భయపడే ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం. అలాంటి అక్తర్ గురుంచి పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రీది బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు.
ఇద్దరు ఆటగాళ్లు గొడవపడాలన్నా, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవాలన్నా అది పాకిస్తాన్ జట్టుకే సాధ్యం. ఇందులో మైదానం లోపలా.. మైదానం వెలుపలా అన్న తేడాలుండవ్. మ్యాచ్ సంఘటనలా.. వ్యక్తి గత విషయాలా అన్న పట్టింపు ఉండదు. వారికి ఏది అనిపిస్తే అదే చేస్తారు.. నోటికొచ్చిన మాట అనేస్తారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం.. అకీబ్ జావేద్, సల్మాన్ బట్, మహమ్మద్ అమీర్, డానిష్ కనేరియా, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్.. వీరందరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న ఆటగాళ్లే.
ఒకరు ‘నాపై వివక్ష చూపేవారంటే..’ మరొకరు ‘కావాలనే నన్ను కూర్చోబెట్టేవారు’ అని, ఇంకొకరు ‘నన్ను డ్రెస్సింగ్ రూంలో తిట్టేవారు’ అని.. ఇప్పటికే ఈ మాజీ ఆటగాళ్లు తమ జట్టులో చోటుచేసుకునే అంతర్గత విషయాలను ఎన్నోమార్లు బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా, అలాంటి విషయం మరొకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ గురుంచి బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. నిత్యం గాయాల బారిన పడే అక్తర్ వాటి నుంచి బయటపడటానికి ఇంజెక్షన్లు తీసుకునేవాడని వెల్లడించాడు. దాని వల్ల అతడు ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది..? అఫ్రిది ఈ విషయాలను ఎందుకు బయటపెట్టాడు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఓ స్పోర్ట్స్ డిబేట్ లో పాల్గొన్న అఫ్రిది.. పాక్ స్పీడ్ స్టర్ ‘షాహిన్ అఫ్రిది’ని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఆసీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో షాహిన్ అఫ్రిది అర్దాంతరంగా తప్పుకోవడాన్ని వేలెత్తి చూపాడు. “అతని స్థానంలో నేనుంటే ఇంజక్షన్స్ తీసుకోనైనా తిరిగి మ్యాచ్ ఆడేవాడనని..” అఫ్రిది తెలిపాడు. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్ళీ రావని, వచ్చినపుడు ఆటగాళ్లు వాటిని వదులుకోకూడదని చెప్పుకొచ్చాడు.
A tough week for Shaheen Afridi who underwent an appendectomy seven days after picking up an injury in the T20 World Cup final.
He will miss Pakistan’s Test match series against England starting next week. pic.twitter.com/BynSm8Vkc8
— Wisden (@WisdenCricket) November 21, 2022
“షోయభ్ అక్తర్ తన కెరీర్ లో ఎన్నోమార్లు ఇంజక్షన్లు తీసుకున్నాడు. గాయాల బాధను తట్టుకోవడానికి అతడు ఈ పని చేసేవాడు. రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడేవాడు. అతడు ఇదంతా ఎందుకు చేశాడు.. దేశం కోసం. భవిష్యత్ లో అనారోగ్యాల బారీన పడతానని తెలిసి కూడా అక్తర్ ఆ రిస్క్ చేశాడు. దాని వల్ల అక్తర్ ప్రస్తుతం నడవలేని స్థితికి చేరుకున్నాడు. కానీ, ఇప్పటి ఆటగాళ్లు అలాంటి సాహసం చేయాటం లేదు. అక్తర్ వంటి బౌలర్ మళ్లీ రాడు. అందరూ అక్తర్ లు కాలేరు. సరే.. అతడు లెజెండ్..’అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shahid Afridi has his say on Shoaib Akhtar’s remarks regarding Shaheen Afridi bowling through injury during the T20 World Cup final 👀
More: https://t.co/sEkzFI3N3I#ShahidAfridi #ShoaibAkhtar #ShaheenAfridi #T20WorldCup #CricketTwitter pic.twitter.com/HT23UDlsK4
— CricWick (@CricWick) February 24, 2023